thesakshi.com : కలకాలం భర్తతో కలిసి ఉండాల్సిన భార్య వివాహేతర సంబంధంతో భర్త అడ్డు తొలగించుకోవాలని చివరికి పక్కా పథకం ప్రకారం తాళి కట్టిన భర్తనే కడతేర్చిన ఘటన పాలమూరు జిల్లాలో వెలుగు చూసింది.. జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం హరిజనవాడకు చెందిన శ్రీశైలం తన భార్య గీత గత కొన్ని నెలల క్రితం హైదరాబాదులోని బతుకుదెరువు కోసం కూలిపనికి వెళ్లారు.
దీంతో బతుకు భారంగా మారడంతో కుటుంబ పోషణ కోసం భార్య గీత అక్కడ తెలిసిన రాజు, విక్రమ్ ల వద్ద 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పు ఇచ్చిన సాకుతో విక్రమ్.. గీతతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో శ్రీశైలం, గీతలు కలిసి తమ స్వగ్రామమైన బూరుగుపల్లికి వచ్చారు. జీవనోపాధి కోసం శ్రీశైలం రోజు కూలిగా పని చేస్తున్నాడు. కాగా తన భర్త శ్రీశైలంని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన భార్య గీత, ఆమె తల్లి, రాజు, విక్రమ్ కలసి ప్లాన్ వేశారు.
పూర్తివివరాల్లో వెళ్ళితే…అప్పు చేసిన పాపానికి తప్పు చేయాల్సి వచ్చింది. ఆ తప్పును అవకాశంగా మార్చుకోవడానికి నేరానికి పాల్పడాల్సి వచ్చింది. ఇదంతా కట్టుకున్నవాడిని కాదని ప్రియుడ్ని నమ్మిన ఓ వివాహిత ఒడిగట్టిన దురాగతం అని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురుగుపల్లి గ్రామంలో శ్రీశైలం అనే వ్యక్తి హత్య కేసులో మిస్టరీ చేధించిన పోలీసులకు పక్కా క్రైమ్ సినిమా స్టోరీని తలపించింది.
హైదరాబాద్ తిలక్‌నగర్‌కి చెందిన సంగీత జడ్చర్ల బూరుగుపల్లికి చెందిన శ్రీశైలంతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం శ్రీశైలం అత్త హైదరాబాద్‌లోనే జీహెచ్‌ఎంసీలో సఫాయి పనిచేస్తుంది. శ్రీశైలంజీవనోపాధి కోసం సొంత ఊరు నుంచి 2016లో హైదరాబాద్‌కు కాపురాన్ని షిప్ట్ చేశాడు. భార్య, కొడుకు, కూతురుతో శ్రీశైలం జీవితం కొంతకాలం సాఫీగా సాగిపోయింది. ఎల్బీనగర్ రత్ననగర్‌లో అద్దెకు ఉంటూ కార్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో శ్రీశైలం భార్య సంగీత ఎదురింట్లో ఉండే విక్రమ్ అనే వ్యక్తి దగ్గర 50వేలు అప్పుగా తీసుకుంది.
ఆ పరిచయమే వారి కుటుంబంలో నిప్పులు పోసింది. డబ్బులు అప్పుగా తీసుకున్న విక్రమ్‌తో సంగీత వివాహేతర సంబంధం కొనసాగించింది. విషయం భర్తకు తెలిసి ఇల్లు మార్చినప్పటికి సంగీతలో మార్పు రాలేదు. హైదరాబాద్‌లో ఉండే ఆమె ప్రవర్తన మారదని భావించి కాపురాన్ని మళ్లీ సొంత ఊరైన బూరుగుపల్లికి మార్చేశాడు శ్రీశైలం. అక్కడే దినసరి కూలీ పని చేసుకుంటున్నాడు.
సంగీత, విక్రమ్ మధ్య గ్యాప్ పెరగడం, ఆమె దగ్గర సెల్‌ఫోన్ లేకపోవడంతో తన స్నేహితుడు రాజును ఆమె దూరపు బంధువుగా ఇంట్లో మకాం పెట్టించాడు. సంగీత సహకారంతో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా శ్రీశైలం విషయాలు తెలుసుకుంటూనే అతడ్ని అడ్డుతొలగించుకొని సంగీతతో శాశ్వతంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ప్లాన్ వేసుకున్నాడు విక్రమ్. ఇందులో భాగంగానే ఓ ఇనుప రాడ్‌ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. గత నెల 31వ తేదిన కొత్త బైక్, కొత్త దుస్తులు కొనుగోలు చేసి ఓ మద్యం సీసాతో పాటు కారం ప్యాకెట్ తీసుకొని రాత్రి 10గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బూరుగుపల్లి సమీపంలోని కిష్టంపల్లికి చేరుకున్నాడు. అక్కడున్న ఓ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి షాపు ఓనర్ ఫోన్‌తోనే రాజుకు ఫోన్ చేసి శ్రీశైలం అత్త వెంకటమ్మ 50వేలు పంపిందని..తాను ఊరు బయట ఉన్నానని వచ్చి డబ్బులు తీసుకెళ్లమని చెప్పాడు.
రాజ మాటలు నమ్మిన శ్రీశైలం అతని వెంట ఊరి చివరకు వచ్చాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్న సమయంలో వెంట తెచ్చుకున్న కారంను శ్రీశైలం కళ్లలో చల్లి ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి చంపేశాడు విక్రమ్.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీశైలంను హతమార్చిన వెంటనే విక్రమ్ బైక్‌పై హైదరాబాద్ చేరుకున్నాడు. సంగీత ఇంట్లో ఉంటున్న రాజు బూరుగుపల్లికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన శ్రీశైలం మృతదేహాన్ని అతని చెల్లెలు గుర్తించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మర్డర్ కేసు నమోదు చేశారు.
ముందుగా సంగీత ఇంట్లో ఉంటున్న రాజుని అదుపులోకి తీసుకొని విచారించడంతో విక్రమ్, సంగీత కలిసి శ్రీశైలంను చంపినట్లు రాబట్టారు. ఈకేసులో నిందితుడు విక్రమ్‌తో పాటు అతనికి సహాకరించిన సంగీత ఆమె తల్లి వెంకటమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లుగా మహబూబ్‌నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు.