thesakshi.com : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో సినిమాల ఎంపిక విషయం నుండి మొదలుకుని సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ షేర్ చేసే వరకు ప్రతి విషయంలో కూడా దూకుడు కొనసాగిస్తూ దూసుకు పోతుంది. సమంత హీరోయిన్ గా గతంతో పోల్చితే ఇప్పుడు రెట్టింపు వేగంతో సినిమాలు చేయడం మాత్రమే కాకుండా సినిమాల ఎంపిక విషయం లో కూడా చాలా స్పీడ్ గా ఉండటం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సినిమాలను వరుసగా కమిట్ అవ్వడంతో అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కోరుకున్న వారు ఇప్పుడు ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత కేవలం తెలుగు తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేయడం తో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
హీరోయిన్ గానే కాకుండా పుష్ప సినిమా లో ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ ను కూడా చేసింది. ముందు ముందు స్టార్ హీరోల సినిమాల్లో ఈమె మరిన్ని ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా ఈమె కెరీర్ లోనే అత్యంత బోల్డ్ పాత్రలను మరియు హాట్ అందాల ఆరబోతను చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై రెచ్చి పోయేందుకు సిద్దం అయ్యింది.
ఆమద్య ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు చేసిన పాత్ర అత్యంత విమర్శనాత్మకంగా బోల్డ్ గా మారింది. ఆ తర్వాత అందాల ఆరబోత లో పీక్స్ అంటూ పుష్ప ఐటెం సాంగ్ లో కనిపించింది. ఇక త్వరలో రాబోతున్న తమిళ మల్టీ స్టారర్ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా లో కూడా సమంత అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుందని.. బోల్డ్ లుక్ తో అభిమానులకు కన్నుల విందు చేయబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన పోస్టర్ లు మరియు పాట ను చూస్తుంటే అర్థం అవుతుంది.
విజయ్ సేతుపతి హీరోగా నయనతార మరియు సమంత లు హీరోయిన్స్ లుగా నటించిన చిత్రం కాతువాకుల రెండు కాదల్ సినిమా గురించి ఇప్పుడు సోషల్మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. నయనతార పద్దతైన చీర కట్టులో కనిపిస్తూ ఉండగా సమంత మాత్రం చాలా మోడ్రన్ గా అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ తో ఈ సినిమా రాబోతుంది.
విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను ప్రేమిస్తాడు. అందులో చివరికి ఎవరితో ఆయన సెటిల్ అవుతాడు అనేది సినిమా కథ అయ్యి ఉంటుంది. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈనెల తమిళంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగు లో కూడా విడుదల చేయాలని హీరోయిన్స్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.