thesakshi.com : సామాక మాధ్యమాలు ఓసారిమంచి పనులు చేస్తాయి. ఫేస్ బుక్ వాట్సాప్ ఇన్ స్టాగ్రామ్ లు ఎన్నో వివాదాలు సృష్టించినా అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తాయి. ఈ క్రమంలో ఎప్పుడో 58 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఓ తండ్రికూతుళ్లను కలపడం విచిత్రమే.ఇన్నాళ్లు తమ కన్న తండ్రి కోసం అహర్నిశలు శ్రమించినా ఫలితం లేదు.
ఎన్నో ఏళ్లుగా తండ్రి జాడ లేకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. కానీ అన్నిటికి కాలమే సమాధానం చెబుతుందని తెలియడంతో విధి మీద భారం వేసి తన పని తాను చేసుకుంటూ పోయింది. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే సామెతను నిజం చేస్తూ ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సుందరస్వప్నం సాకారం కావడానికి ఫేస్ బుక్ వేదికైంది.
లండన్ లోని జోహన్స్ బర్గ్ లో నివాసముండే ఓ మహిళ తన ఏడాది వయసున్నప్పుడే తండ్రికి దూరమైంది. అప్పటి నుంచి తన తండ్రి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. అయినా ఆమె ఆశ మాత్రం తీరలేదు. దీంతో ఎప్పటికైనా తండ్రి చెంతకు చేరతాననే నమ్మకం ఆమెలో సడలలేదు. దీంతో ఆమె ఎదురుచూడటం మాత్రం మానలేదు.
వీలున్నప్పుడల్లా తన చిన్ననాటి తండ్రి ఫొటోను షేర్ చేస్తూ తండ్రి తన చెంతకు రావాలని కోరింది. ఇటీవల ఆమె పెట్టిన ఫొటోకు స్పందించిన తండ్రి ఆమె చిరునామా కనుక్కుని వివరాలు తెలుసుకున్నాడు. ఇక ఇద్దరు కలుసుకుని ఊసులు పంచుకున్నారు. ప్రేమానురాగాలు పంచుకున్నారు.
నువ్వా దరిని నేనీ దరిని కృష్ణమ్మ కలిసింది ఇద్దరిని అన్నారో సినీకవి. ఇలా తండ్రి కూతుళ్లు ఇన్నేళ్ల తరువాత కలుసుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. దీంతో వారి చిన్ననాటిస్మృతులు పంచుకున్నారు. కాగా ఆమెకు తన తండ్రి మొదటి వాడే అయినా ప్రస్తుతం ఉన్న తల్లి రెండోది కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ వేదికగా కుటుంబం ఒక్కటి కావడం విశేషం. మొత్తానికి ఫేస్ బుక్ ఓ మంచి పని చేసింది. తండ్రి కూతుళ్లు కలుసుకోవడానికి సహకరించడం నిజంగా ఆహ్వానించదగినదే.
చిన్ననాటి కలనెరవేరినందుకు సంతోషంగా ఉందని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఎన్నో ఏళ్లుగా కన్న వారి కోసం తపించిన తనకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉందని పేర్కొంది. ఇక జీవితంలో తన వారిని కలుసుకోలేమోనని బెంగ తీరింది. తండ్రి ప్రేమకు ఇన్నాళ్లుదూరమైనందుకు తాను ఎంతో కోల్పోయానని చెమ్మగిల్లే కళ్లతో చెప్పింది. ఫేస్ బుక్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపింది. ఇక తనకు ఏమి అక్కరలేదని బాధాతప్త హృదయంతో పలికింది. సామాజిక మాధ్యమాల వల్ల కొన్ని చెడులు ఉన్నా కొన్ని సందర్భాల్లో మంచి శకునాలు కూడా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం.