thesakshi.com : తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. తెలంగాణలో మార్పు తథ్యం. ఒక్క కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణిచివేయాలని చూస్తోంది. కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఒక్క కుటుంబం సంక్షేమం కోసమే కొన్ని పార్టీలు పని చేస్తున్నాయి.అని ప్రధాని మోదీ కేసిఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
Landed to a warm welcome in Hyderabad. Watch. https://t.co/419lI4lvV0
— Narendra Modi (@narendramodi) May 26, 2022
తెలంగాణ లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తెరాస పై నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు.
బేగంపేట ఎయిర్ పోర్టులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు దేశానికి చేటు అని మోడీ చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాాలన అంతా అవినీతిమయంగా మారిందన్నారు.తెలంగాణ భవిష్యత్తు కోసం తాము పోరాటం చేస్తున్నట్టుగా మోడీ చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తొందని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల అభిమానమే తన బలమన్నారు. మీ ప్రేమే తన బలమన్నారు. మీ అభిమానం, అప్యాయతలకు కట్టుబడి ఉన్నానన్నారు. దేశ సమగ్రత మన చేతుల్లోనే ఉందన్నారు. బీజేపీకి చెందిన ఒక్కొక్క కార్యకర్త సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల కోసం పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చామని మోడీ చెప్పారు.
బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడుల విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాడుల్లో మరణించిన బీజేపీ కార్యకర్తలకు శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టుగా చెప్పారు. పట్టుదలకు, పౌరుసానికి తెలంగాణ ప్రజలు మారుపేరని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.