thesakshi.com : తెలంగాణ వలస కాలనీ అవుతాదా అన్న ఆవేదన ఉండేదని సీఎం కేసీఆర్ తెలిపారు.పిడికడి మందితో ఉద్యమం స్టార్ట్ చేసాం.తెలంగాణ ఆకాంక్ష 2014 లో సాకారం అయ్యింది.ఎన్నికల్లో పార్టీలు ఓడడం గెలవడం ప్రజాస్వామ్యములో
నిరంతరం ప్రక్రియ.ఇది కష్టపడి సాధించిన రాష్ట్రం తెలంగాణ.శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు…ఇది రాచరిక వ్యవస్థ కాదు.
ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాను.ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కయ్య కయ్య మాట్లాడమన్నారు…నా నుంచి కాదు అని చెప్పిన.వ్యవసాయము మీద మాట్లాడనికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లును కలసి చర్చించా.ఆ రోజు నేను వ్యవసాయం మీద మాట్లాడితే…అప్పట్టి స్పీకర్ ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
గతంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి.గొర్రెలు పెంపకంలో తెలంగాణ ఇప్పడు నెంబర్ వన్..ఇది నా లెక్క కాదు…కేంద్ర మంత్రి లెక్క.అన్ని రకాల సంపద ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో నష్ట పోయింది.కులం లేదు …మతం లేదు.. జాతి లేదు …వాటిని పట్టించుకోమ్.
రైతు బంధు లక్ష్యం నెరవేరింది.తలసరి విద్యుత్ వినియోగం లో ఇప్పడు తెలంగాణ నెంబర్ వన్.కేసీఆర్ కిట్ పెట్టాలని ఎవరు అయిన ధర్నా చేసారా ?ధరణి తీసుకురావాలని ఎవరు అయిన ధర్నా చేసారా ?
ఆంధ్రప్రదేశ్ ఎఫ్సీఐ కి జోకింది ఎంత ? తెలంగాణ జోకింది ఎంత ?కలెక్టరేట్ లు ప్రారంభించుకుంటున్నాము.హరిత హారంతో తెలంగాణ పచ్చ బడింది.తెలంగాణ బార్డర్ దాటిన వెంటనే చెట్లు ఉండవు.నోరు ఇచ్చారని కుక్కులు మోరిగినట్టు మొరిగితే ఎట్లా ?ప్రజలు వరుస ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తున్నారు
ప్రతి ఎలక్షన్ లో ప్రజలు టిఆర్ఎస్ ను దీవిస్తున్నారు.ఎన్నికల కోసమే దళిత బంధు అంటున్నారు- నిజమే.రాజకీయం చేస్తున్నారు అంటే చేయొద్ద మరి!రాజకీయ ప్రయోజనం అంటే- ప్రయోజమ్ ఉండొద్దా మరి.నాకు రాజకీయ స్వార్థం ఉంటే దళిత బంధు గజ్వెల్ లో పెట్టేవాన్ని.రైతు మరణిస్తే గతంలో 50వేలు ఇచ్చే వాళ్ళు- ఇవ్వాళ 5లక్షలు వస్తున్నాయి.