thesakshi.com : మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని గగ్గి తిప్ప దగ్గర 115 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మిస్తున్న పశువుల సంతకు ,సంత మౌలిక వసతులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని భూమిపూజ చేసినమైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమ లొనే ప్రత్యేక స్థానం కలిగిన సంత మైదుకూరు పశువుల సంత .
నంద్యాల రోడ్ లో ఉన్న సంత కేవలం 1.50 ఎకరాల స్థలంలో ఉండటం తో
సంతకు వచ్చేవారికి ఇబ్బందులు ఎదురువుతున్న దృష్ట్యా ఈ సంతను
మునిసిపాలిటీ లో ని గగ్గి తిప్ప దగ్గర 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కొత్త పశువుల సంతను జూన్ చివరి వారంలో ప్రజలకు అందుబాటులో కి తెస్తాం అని తెలిపారు .
అంతే కాకుండా పాత సంత స్థలంలో రోడ్డు వెంబడి 60 లక్షల రూపాయల తో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కు అలాగే..సంత స్థలంలో 75 లక్షల రూపాయల తో రైతు బజారు ను ఏర్పాటు చేయబోతున్నాము అని స్పష్టం చేశారు.
అలాగే రాబోయే ఈ రెండు సంవత్సరాల కాలం లో మైదుకూరు ను అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఎమ్మెల్యే తెలిపారు.