thesakshi.com : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన
ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ కీలక ప్రకటన చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లుగా ఉగాది రోజున పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకే మంగళవారం నాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన పవన్.. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని తెలిపారు. ఈ పరామర్శ యాత్రలను ఈ నెల 12న అనంతపురం నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ ప్రకటించారు
ఈనెల 12 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అనంతపురం నుంచి తన యాత్రను ప్రారంభించనున్న పవన్.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేత