thesakshi.com : కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఐదుగురు మృతి
గౌహతి ఎక్స్ప్రెస్ చైన్ లాగి పట్టాలు దాటుతుండగా ప్రమాదం..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం-బాతువా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు కొందరు రైలు దిగి పక్క ట్రాక్ పై నిల్చున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. ఆ ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మృతదేహాల ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
5 feared killed & many injured after a speeding train ran over them at #Bathua of G #Sigadam zone in #Srikakulam dist.
The passengers got down from Guwahati bound train, when it halt, run over by #KonarkExpress came on adjacent track. #AndhraPradesh @serailwaykol @RailMinIndia pic.twitter.com/LKSuT04g9J— Surya Reddy (@jsuryareddy) April 11, 2022
శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచే శారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు అందించారు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని, అందులోని కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, అదే సమయంలో మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టడంతో కొంతమంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు.