thesakshi.com : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మదనపల్లె-పుంగనూరు చిత్తూరు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం మదనపల్లె రూరల్ మండలం 150వ మైలు వద్ద వేగంగా వస్తున్న కారు కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. మృతుల్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో రెడ్డివారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులను గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవారెడ్డిగా గుర్తించారు. పలమనేరులో పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు.