thesakshi.com : బాలీవుడ్ ఐటమ్ గాళ్ మలైకా అరోరాఖాన్ అన్ లిమిటెడ్ ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసినదే. ఇంతకుముందు మాల్దీవుల విహార యాత్ర నుంచి బికినీ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత గోవాలో తన సోదరి అమృత అరోరా బీచ్ విల్లా నుంచి రకరకాల యోగా భంగిమలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. తాజాగా మరో హాటెస్ట్ యోగా భంగిమ యువతరంలోకి జెట్ స్పీడ్ తో దూసుకువెళుతోంది.
అంతేకాదు.. ఇకపై ఏడాది పాటు ఫ్రీగా యోగా క్లాసులు చెబుతానంటూ మలైకా ఇనిషియేట్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన యోగాసనం గురించి ఇంట్రో ఇచ్చింది మలైకా.
“కొన్నిసార్లు ఇది మీ పరిమితులను దాటి మీకు నచ్చినదాన్ని చేయడం.. స్వేచ్ఛగా ఉండటం.. లేదా ఏదో ఒక దిశలో కదలడం. కాబట్టి ఈ వారం మలైకా మూవ్ ఆఫ్ ది వీక్..ని పరిచయం చేస్తున్నాం! అంటూ ఇలా స్పెషల్ భంగిమను మలైకా షేర్ చేశారు. మీరు ఇష్టపడే కదలికను అనుసరించడం ద్వారా మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా మలుచుకోండి. ఈ వారం మీ ప్రత్యేకమైన యోగాసనాన్ని మాతో పంచుకోండి.. మీరు మీ యోగాసనాన్ని షేర్ చేసినపుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు! అంటూ తనదైన ప్రచారం ప్రారంభించింది. ముంబైలో ప్రముఖ యోగా స్టూడియోస్ తో కలసి మలైకా ఉచిత యోగా క్లాసులు ప్రారంభించింది.
అంతేకాదు.. మలైకా బయోలో లింక్ క్లిక్ చేసి ఒక సంవత్సరం ఉచిత యోగా ప్రోగ్రామ్ ను గెలుచుకునే అవకాశాన్ని పొందండి.. అంటూ ఆఫర్ చేసింది. మొత్తానికి యోగా ప్రియులకు ఇది శుభవార్తనే. ఇకపై మలైకా యోగా క్లాసులను రెగ్యులర్ గా ఫాలో చేసే సువర్ణాకాశం లభించినట్టే. బాలీవుడ్ లో యోగా అనగానే శిల్పాశెట్టి పేరే గుర్తుకు వస్తుంది. ఇటీవల మలైకా కూడా తనదైన శైలిలో పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక మలైకా డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకునే ఆలోచన లేదని ఇంతకుముందు వెల్లడించారు మలైకా.