THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా..?

thesakshiadmin by thesakshiadmin
September 25, 2021
in Latest, Politics, Slider
0
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా..?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా? పార్టీకి దూరమవుతున్న వర్గాలను ఆయ న చేరువ చేసుకునే పనిలో మరో అడుగు ముందుకు వేశారా. అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు చాలా వర్గాలు దూరమయ్యాయి. కారణాలుఏవైనా.. యువత పార్టీకి దూరమైంది. అదేసమయంలో మహిళా వర్గాలను ఆకర్షించేందుకు ప్రవేశ పెట్టిన పసుపు-కుంకుమ ఫలించలేదు. అదేసమయంలో గ్రామీణ ఓటు బ్యాంకు దెబ్బతింది. ఇక కీలకమైన ఎస్సీ సామాజిక వర్గం కూడా బాబును దూరం పెట్టింది. దీంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టి.. అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలోనే జగన్ సర్కారు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఎండగడుతు న్నారు. ఎక్కడికక్కడ ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు దూరమైన వర్గాలను చేరువ చేసుకుంటున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూనే.. మరోవైపు.. సామాజిక వర్గాల వారీగా కూడా చంద్రబాబు.. అందరికీ ఉపశమనం కలిగించడం గమనార్హం.

ఈ క్రమంలోనే మహిళలకు కూడా ప్రాధాన్యం పెంచారు. అయినప్పటికీ.. వ్యక్తిగతంగా.. మరింత ఇమేజ్ సొంతం చేసుకునే క్రమంలో ఆయన గతంలో తనను తిట్టిపోసిన వారిని కూడా కలుస్తున్నారు. తాజాగా.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను చంద్రబాబు పరామర్శించారు. ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణమాదిగను ఆయన పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేరాలకు పాల్పడలేదని వివరించారు.

తాము రౌడీయిజం చేయాలనుకుంటే వారు బయటకు వచ్చేవారు కాదన్నారు. ఏపీలో టీడీపీని ఎవరూ ఏం చేయలేరని వారు పెట్టేవన్నీ తాత్కాలిక ఇబ్బందులేనని స్పష్టం చేశారు. అయితే.. ఒకప్పుడు మంద కృష్ణ.. చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. గత ఎన్నికల్లో జగన్కు పరోక్షంగా కృష్ణ సహకరించారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంద కృష్ణను బాబు పరామర్శించడం.. ఎస్సీల వైపు ఆలోచన చేస్తున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags: #AP POLITICS#NARA CHANDRABABU NAIDU#POLITICAL STARGZING#TDP#TELUGUDESAM PARTY
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info