thesakshi.com : చంద్రబాబు ఇపుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వార్ వన్ సైడ్ అంటున్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే అధికారమని కూడా ఆయన చెబుతున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడినా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా చంద్రబాబులో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారుతోందా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. వార్ వన్ సైడ్ అంటే మొత్తానికి మొత్తం ఓట్లు కుప్పలా వచ్చి టీడీపీ బ్యాలెట్ బాక్సుల్లో పడిపోవాలి. ఏపీలో అధికార పక్షానికి సింగిల్ సీట్లు రావాలి. అలాంటి సీన్ అయితే ఉందా అంటే కనిపించడంలేదు అంటున్నారు.
అదే టైమ్ లో చంద్రబాబు మాటల వరకూ వార్ వన్ సైడ్ అంటున్నారు కానీ ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో మాత్రం గుట్టు విప్పడంలేదు. రేపటి రోజున ఆయన పొత్తులతోనే వస్తారు అని అంతా అనుకుంటున్నారు. మరి పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే వైసీపీ పని ఎలా అయిపోయింది అని చెప్పగలరు అని అంటున్నారు.
అయితే గతంలో కంటే ఇపుడు టీడీపీకి జనాదరణ పెరిగిందని సీమ జిల్లాల్లో కూడా మార్పు వస్తోందని ఇక కోస్తా జిల్లాలూ ఎటూ కొమ్ము కాస్తాయి కాబట్టి వైసీపీ గద్దె దిగడం ఖాయమన్న అంచనాతోనే బాబు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏది ఏమైనా ఇది రాజకీయం. ఒక రాజకీయ పార్టీ పని అయిపోయిందని అనుకోవడం వరకూ ఓకే కానీ అదే ఉదాశీనత అయితే అసలు పనికిరాదు.
అయితే చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం సొంత పార్టీ వారిలో ధైర్యం పెంచి వైసీపీని డీ మోరలైజ్ చేయడానికి ఆ పార్టీ పని అయిపోయింది అని ప్రచారం చేసుకుంటే పరవాలేదు కానీ నేల విడిచి సాములు చేసినా లేక ఒవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించినా అసలుకే ఎసరు వస్తుంది అన్న వారూ ఉన్నారు.
రాజకీయాల్లో చాణక్యుడిగా పేరుపొందిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొత్తులపై తన వ్యూహాన్ని మార్చారు. ఇప్పటివరకు జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతమైన తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అర్థమవుతోందికానీ ఇంత తీవ్రస్థాయిలో ఉందని మహానాడుకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసిన తర్వాతే ఒక స్పష్టత వచ్చిందని చంద్రబాబునాయుడు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
మహానాడు జరిగిన రెండు రోజుల్లోను పొత్తుల గురించి ఎక్కడా చంద్రబాబు ప్రస్తావించలేదు. ఇతర నేతలు కూడా తమ ప్రసంగాల్లో పొత్తుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి మాట్లాడాలని తాజాగా చంద్రబాబు అన్నారు. జనసేన కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.
పొత్తుల విషయాన్ని పక్కనపెట్టి ముందుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేం చేయాలని బాబు నాయకులందరికీ ఆదేశాలు జారీచేశారు. 35 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జిలు లేరు. ముందు వారిని నియమించిన తర్వాత మహానాడు విజయం ఇచ్చిన ఊపును రెండు సంవత్సరాలపాటు కొనసాగించాలని నిశ్చయించారు. పొత్తుల విషయమై ఇప్పుడే మాట్లాడితే సీట్ల సంఖ్య, బలమైన స్థానాలను కోల్పావాల్సి రావడం, అధికారం పంచుకునే విషయంతోపాటు పలురకాల విషయాలను చర్చించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు ఆ విషయాన్ని వాయిదా వేశారు.
పొత్తుల గురించి అటువైపు నుంచి కూడా స్పందన రావాలని, స్పష్టత ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈలోగా బాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. నాయకులంతా బలసమీకరణ చేయాలని ఆదేశించారు. ముందుగా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆయా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీనికితోడు నారా లోకేష్ పాదయాత్ర కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఎన్నికలు జరిగే సమయం వరకు టీడీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండబోతున్నారు. చివరగా మాత్రమే పొత్తుల విషయాన్ని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.అప్పటివరకు పార్టీ బలోపేతమే టీడీపీ లక్ష్యంగా ఉంది.
అయితే చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం సొంత పార్టీ వారిలో ధైర్యం పెంచి వైసీపీని డీ మోరలైజ్ చేయడానికి ఆ పార్టీ పని అయిపోయింది అని ప్రచారం చేసుకుంటే పరవాలేదు కానీ నేల విడిచి సాములు చేసినా లేక ఒవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించినా అసలుకే ఎసరు వస్తుంది అన్న వారూ ఉన్నారు