Thursday, April 15, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

దాచేస్తే దాగని నిజాలు..!

దాచేస్తే దాగని నిజాలు..!
0
SHARES
7
VIEWS

thesakshi.com    :   పుకార్లు కథానాయికల జీవితంలో ఒక భాగం. కానీ అన్ని పుకార్లు ఒకేలా ఉండవు. కొన్ని నిజాలుంటాయి. నిప్పు లేనిదే ఎక్కడా పొగ రాదు! అంతో ఇంతో నిజం లేకుండా దానంతట అదే ఏదీ పుట్టుక రాదు. అలా ఆరంభం పుకార్లుగా భావించినవి నిజాలు అయిన సందర్భాలు టాలీవుడ్ కథానాయికల జీవితాల్లో ఉన్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చి ఆ నిజాన్ని దాచాలని ప్రయత్నించి మీడియాకి దొరికిపోయిన వాళ్లు చాలామంది.

దాచేస్తే దాగని ఇలాంటి నిజాలు విన్నప్పుడు ఎల్లప్పుడూ అభిమానులు షాక్ కి గురవుతుంటారు. అలాంటి కాదనలేని.. దిగ్భ్రాంతికరమైన వార్తలతో నిరంతరం మీడియాలో హైలైట్ అయిన పలువురు కథానాయికల వివరాల్ని పరిశీలిస్తే.. ఎంతో లైఫ్ మెలోడ్రామా బయటపడుతుంది.

మన అగ్ర కథానాయికలంతా దాదాపు రెండు మూడు భాషలలో బిజీ ఆర్టిస్టులుగా కొనసాగారు. గర్భం కారణంగా ఆకస్మిక వివాహంతో షాక్ లు ఇచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు ప్రియుడి మొదటి భార్య నుండి చట్టపరమైన ఇబ్బందుల కారణంగా చాలా కాలం లివ్-ఇన్ రిలేషన్ షిప్ ని మాత్రమే సాగించారు.

అందువల్ల వారి గర్భం పెద్ద సెన్సేషనల్ వార్త కాలేదు. ఇప్పటికీ వారు వివాహానికి ముందు గర్భవతి అయ్యారని స్వయంగా చెబుతుంటారు. అయితే కొందరు హీరోయిన్లు ఆకస్మిక గర్భధారణ వార్తలతో తమ అభిమానులకు నిజంగా షాక్ కి గురి చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇది సంపూర్ణ ప్రైవేట్ (వ్యక్తిగత) వ్యవహారం అయినప్పటికీ సమాజానికి ప్రతిసారీ సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక కట్టుబాట్ల పరంగా చాలా విమర్శలను ఎదుర్కొన్న తరువాత వివాహం చేసుకున్న ఆ నటీమణులు డజను పైగా ఉన్నారు.

క్లాసిక్ డేస్ అందాల కథానాయిక శ్రీదేవి – నిర్మాత బోనీ కపూర్ మధ్య అనుబంధం గురించి తెలిసినదే. శ్రీదేవి 1996 లో బోనీ కపూర్ ను వివాహం చేసుకున్నప్పుడు 7 నెలల గర్భవతి. బోనీ అప్పుడు తన మొదటి భార్యతోనే ఉన్నారు. విడాకులు తీసుకోని ఆయనతో అంతకుమించి శ్రీదేవికి వేరే మార్గం లేదు. శ్రీదేవి ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు.

కమల్ హాసన్- సారిక అనుబంధం అలాంటిదే. సారికతో ప్రత్యక్ష సంబంధంలో ఉండగా `వాణి గణపతి`ని అప్పటికే కమల్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురితో రిలేషన్ కొనసాగింది. కాలక్రమంలో సారికను పెళ్లాడక ముందే శ్రుతి హాసన్ జన్మించింది. కమల్-సారిక జంట చాలా కాలం తరువాత వివాహం చేసుకుని అక్షరకు జన్మనిచ్చారు.

కథానాయిక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ సరసన బద్రిలో నటించిన రేణు..ఆ సమయంలోనే లివ్-ఇన్ రిలేషన్ షిప్ లోకి ప్రవేశించారు. చాలా విమర్శల తర్వాత రేణు 2004 లో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్నప్పటికీ అప్పటికే(2004లోనే) ఒక పసికందును ప్రసవించారు. అఖీరా నందన్ జననం తరవాతే ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

హాట్ గాళ్ సెలినా జైట్లీ పీటర్ హాగ్ తో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఆమె వివాహానికి ముందు కవలలతో గర్భవతిగా ఉన్నారు. దీని ఫలితంగా ఆమె ఆకశ్మిక వివాహం జరిగింది. రెండు తెలుగు చిత్రాలలో (శ్రీకాంత్.. జగపతి బాబు) నటించిన మహిమా చౌదరి పెళ్ళికి ముందే గర్భవతి. ఆ తర్వాత ఆమె తన భర్త బాబీని వివాహం చేసుకుని ఒక ఆడ శిశువును ప్రసవించారు.

పాకిస్తానీ నటి వీణా మాలిక్ `నగ్న సత్యం` అనే తెలుగు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ భామ వివాహానికి ముందు గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. వీణామాలిక్ దుబాయ్ ఆధారిత వ్యాపారవేత్తను తొందరపాటుతో వివాహం చేసుకున్నారని.. కానీ అప్పటికే పుట్టిన బిడ్డ మాజీ ప్రియుడి సంతానం అని పుకార్ వినిపించింది. అయితే ఖచ్చితమైన నిజం ఎవరికీ తెలియదు.

వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి గర్భవతి అయ్యారు ప్రముఖ నటి నీనా గుప్తా. అయితే రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా నీనా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న విదేశీ భామ నటాషా స్టాంకోవిక్ పెళ్లికి ముందు గర్భం దాల్చింది. అంగద్ దూపియాతో చాలా కాలం రిలేషన్ తర్వాత పెళ్లాడిన నేహా ధూపియా అప్పటికే గర్భవతి. ఈ మాజీ మిస్ ఇండియా ఈ మధ్యే కూతురుకు జన్మనిచ్చారు. స్టార్ హీరో అర్జున్ రాంపాల్ తో చాలా కాలం సహజీవనం చేసిన విదేశీ హాట్ గాళ్ గాబ్రియెల్లా ప్రస్తుతం గర్భవతి. మెహర్ జెసియాను పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్ల పాటు కాపురం చేసిన అర్జున్ రాంపాల్ గత ఏడాది విడిపోయాడు. విడాకులకు ముందే గాబ్రియెల్లాతో సహజీవనం సాగిస్తుండడం చర్చనీయాంశమైంది.

2016 అక్టోబరులో పెళ్లి చేసుకున్న లీసా హెడెన్ 2017 మేలో మగబిడ్డకు జన్మనిచ్చారు. లీసా పెళ్లికి ముందే గర్భవతి. పెళ్లికి ముందే షకీల్ లడక్ తో ఎఫైర్ సాగించిన మలైకా సోదరి అమృతా అరోరా గర్భిణి అయ్యానని ప్రకటించాకే పెళ్లాడారు. ఏళ్ల తరబడి రణవీర్ షోరేతో డేటింగ్ చేసిన కొంకనా సేన్ శర్మ.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలకే తాను గర్భిణి అన్న విషయం బయటపెట్టారు. లండన్ బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయటౌతో నిశ్చితార్థ సమయానికే ఎమీజాక్సన్ గర్భవతి. ఆ విషయాన్ని తనే ప్రకటించింది. శ్రీమంతం కూడా ఘనంగా జరిపించారు. ఇప్పుడు బిడ్డను కూడా కన్నది. త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం ఉంది.

Tags: #BOLLYWOOD ACTRESS#FILM NEWS#INDIAN FILM ACTORS#PREGNANCIES#TOP HEROINSHeros
ShareTweetSendSharePinShare
Previous Post

భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్ ఉచితం నుంచి అమ్మకానికి..?

Next Post

‘ఆదిపురుష్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్

Related Posts

మూవీ రివ్యూ : ‘ఉప్పెన’
Latest

ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన..!

April 14, 2021
ఫ్యాన్స్ కోసం తగ్గేదే లే అన్న అల్లు అర్జున్!
Latest

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ మూవీ..?

April 14, 2021
పవన్ ఆలోచనా విధానానికి తగిన కథే వకీల్ సాబ్:ప్రకాష్ రాజ్
Latest

పవన్ ఆలోచనా విధానానికి తగిన కథే వకీల్ సాబ్:ప్రకాష్ రాజ్

April 14, 2021
Next Post
‘ఆదిపురుష్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్

'ఆదిపురుష్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది …!

పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది …!

April 14, 2021
రైతుల బాధల గురించి ఆలోచించారా..?

రైతుల బాధల గురించి ఆలోచించారా..?

April 14, 2021
మూవీ రివ్యూ : ‘ఉప్పెన’

ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన..!

April 14, 2021
ఫ్యాన్స్ కోసం తగ్గేదే లే అన్న అల్లు అర్జున్!

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ మూవీ..?

April 14, 2021
‘ఉలా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

‘ఉలా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

April 14, 2021
మరోసారి మానవత్వం నిరూపించుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్!

మరోసారి మానవత్వం నిరూపించుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్!

April 14, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.