THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

ఆమె ఎలా మాయమైంది…?!

thesakshiadmin by thesakshiadmin
October 29, 2021
in Crime, Latest
0
ఆమె ఎలా మాయమైంది…?!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   ప్రపంచ వ్యాప్తంగా మిస్టరీగా ఉండే కేసులు ఎన్నో ఉన్నాయి. అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒకటి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివశించే సింథియా తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించేది. ముఖ్యంగా ఆమె తండ్రి అంటే అమితమైన గౌరవం ఉన్నది. తనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ పెద్దగా ఎవర్ని కలిసేది కాదు. అప్పుడప్పుడు తన తండ్రికి తెలియకుండా తన బాయ్ ఫ్రెండ్ ను కలుస్తూ ఉండేది. 1981లో ఒహియోలోని టోలెడోలో లీగల్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించింది. కష్టపడి పనిచేస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అమెరికా.. ఒహియో రాష్ట్రంలోని ఓ గౌరవమైన కుటుంబంలో పుట్టింది. ఆ ఇంటి వారు మత సంప్రదాయాల్ని కచ్చితంగా పాటిస్తారు. అందువల్ల వారి రోజువారీ పనుల షెడ్యూల్లో ప్రార్థన మీటింగ్స్ స్విమ్మింగ్ ఈవెంట్స్ క్యాంపింగ్ ఈవెంట్స్ సీజనల్ పార్టీలు ఆదివారం చర్చికి వెల్లడం వంటివి తప్పనిసరి.

అదే విధంగా సింథియా కూడా ప్రతి వారూ కుటుంబ సభ్యులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొనేది. సింథియా తండ్రి మైకెల్ అండెర్సన్కి ఆమె అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే సింథియా ఏనాడూ తండ్రికి ఎదురు చెప్పేది కాదు. చాలా సైలెంట్గా ఉండేది. తండ్రిని ఎంతగానో గౌరవించేది. సింథియాకు చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉండేవారు. అయినప్పటికీ ఆమె వారితో కలిసి బయట తిరగడం ఎంజాయ్ చెయ్యడం వంటివి చెయ్యలేదు. ఎప్పుడూ తన హద్దుల్లో ఉంటూ… తల్లిదండ్రులకు చిన్న మాట కూడా తనవైపు నుంచి రాకుండా జాగ్రత్త పడేది. మరి ఆమె ఎలా మాయమైంది

అయితే ఆమెకు నవలలు చదవడం అంటే బాగా ఇష్టం. ఖాళీ సమయాల్లో నవలలు చదువుతుండేది. ఆఫిస్ లోని తన గదికి బయట గోడపై ఓరోజు ఐ లవ్యూ సిండీ బై జీ డబ్ల్యూ అని రాసి ఉండటం చూసింది. ఆ తరువాత కొన్ని రోజులకు దానిని ఎవరో చెరిపివేశారు. ఆ తరువాత మరలా అలానే రాశారు. 1981 ఆగస్ట్ 4 వ తేదీన సింథియా ఎప్పటిలాగే ఆఫీస్కి వచ్చింది. గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంది. టేబుల్పై ఉన్న రేడియో ఆన్ చేసింది. ఆ తారువాత ఏమయిందో తెలియదు. మాయం అయింది.

మధ్యాహ్నం బాస్ రాబిన్సన్ ఆఫీస్ కు వచ్చాడు. సింథియా రూమ్ లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తెరిచే ప్రయత్నం చేశాడు. తెరుచుకోలేదు. పోలీస్ అధికారుల సహాయంతో డోర్ ఓపెన్ చేశారు. లోపల సింథియా లేదు. ఆమెకు ఇష్టమైన నవల టెబుల్ పై ఉన్నది. అతను వచ్చి కత్తితో బెదిరించి ఎత్తుకు పోయాడు లైన్ ఉన్న పేజీ తెరిచి ఉన్నది. సింథియాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. కానీ సింథియా లేదు. ఏమయిందో తెలియలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింథియా కేసు మిస్టరీగానే ఉండిపోయింది.

ఆగస్ట్ 4 1981. ఆ రోజు సింథియా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినలేదు. రోజూలాగే… తన పేరెంట్స్ ఇంటి నుంచి ఉదయం 8-30కి ఉద్యోగం పనిపై ఆఫీసుకు తన కారులో బయలుదేరింది. ఉదయం 9-45కి లా ఆఫీస్కి వచ్చింది. చెప్పాలంటే ఆమె ఎందుకో ఆ రోజు కాస్త లేటుగానే ఆఫీసుకి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైమ్ అయ్యింది. ఆమె బాస్ జేమ్స్ రాబ్బిట్… ఆఫీసుకి వచ్చాడు. ఆఫీస్ తలుపులు మూసివున్నాయి. లోపల గడియ వేసి ఉంది. కానీ సింథియా పలకలేదు. కిటికీల తలుపులన్నీ మూసేవున్నాయి. గ్లాస్ అద్దాల్లోంచీ లోపలికి చూశాడు. లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. రేడియో కూడా ఆన్లోనే ఉంది.

కానీ సింథియా అక్కడ లేదు. ఆ సమయంలో నెయిల్ పాలిష్ వాసన వచ్చింది. ఆఫీసులో పాత ల్యాండ్ ఫోన్లు… హుక్ నుంచి తీసి పక్కన పెట్టినట్లుగా ఉన్నాయి. తద్వారా ఎవరైనా కాల్ చేసినా కాల్ వెళ్లదు. ఆఫీసులో ఎక్కడి వస్తువులు అక్కడే చక్కగా ఉన్నాయి. ఎవరో ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఏదీ లేదు. పార్కింగ్ లాట్లో ఆమె కారు అలాగే ఉంది. కారు కీస్ సింథియా పర్స్ మాత్రం అక్కడ లేవు. సింథియా అప్పుడప్పుడూ చదివే ఓ రొమాన్స్ నవల ఆమె డెస్క్ దగ్గర తెరచివుంది. అందులో తెరచివున్న పేజీలో… “అతను వచ్చి కత్తితో బెదిరించి ఎత్తుకుపోయాడు” అని నవలలో స్టోరీ ఉంది. ఇంతకు మించి ఏమీ లేదు. మరి సింథియా ఏమైంది… ఇప్పటివరకూ ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది.

Tags: #AMERICA#Cynthia Anderson#Cynthia Jane Anderson#Legal Secretary#USA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info