thesakshi.com : హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలో ఇద్దరు గ్రామస్తులు ఓ వ్యక్తికి మద్యం తాగించి, అతని భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
నిందితులు మహిళను కూడా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వారిని సురేష్, శ్రీకాంత్‌గా గుర్తించారు.
ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా, మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.