thesakshi.com : మంగళవారం ఉదయం నానక్‌రామ్‌గూడలో ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో 11 మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.