thesakshi.com : బాలీవుడ్ సెక్సీ లేడీ పూనమ్ పాండే గత కొంత కాలంగా వార్తల్లో వుంటోంది. భర్త కారణంగా మరో సారి వార్తల్లో నిలిచిన పూనమ్ తాజాగా కంగన కారణంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం `లాక్ అప్` అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్ లు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తుండటంతో హాట్ టాపిక్ గా మారుతోంది.
వరుస వివాదాలు విమర్శలతో ముందుకు సాగుతున్న ఈ రియాలిటీ షో ఎమ్ ఎక్స్ ప్లేయర్ ఆల్ట్ బాలీజీ లో ప్రసారం అవుతోంది. ఈ షోపై సర్వత్రా విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. ఇలాంటి వివాదాస్పద షోలో సెక్సీ లేడీ పూనమ్ పాండే కూడా పాల్గొంటోంది. తాజాగా ప్రసారమైన ఓ ఎపిసోడ్ లో పూనమ్ పాండే తన గతాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. అంతే కాకుండా తన రియల్ లైఫ్ లో జరిగిన విషాదకర సంఘటనలని పంచుకుంది.
పూనమ్ పాండే గతంలో తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నివసించేదట. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తనని ఫ్యామిలీ మొత్తం ఇంటి నుంచి గెంటేశారని తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని అయినా తనని ఫ్యామిలీ అంతా ఎందుకు బయటికి పంపించేశారో అర్థం కాలేదని వాపోయింది. తన పనిలో తాను బిజీగా వున్నానని ప్రతి ఒక్కరూ తన గురించి చెడుగా భావించారని కన్నీళ్లు పెట్టుకుంది.
నా గురించి చెడుగా మాట్లాడే ముందు నన్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని పూనమ్ పేర్కొంది. పూనమ్ పాండే ఆ మధ్య శామ్ బాంబే అనే వ్యక్తితో రెండేళ్లు డేటింగ్ చేసింది. ఆ తరువాత అతన్నే గత ఏడాది సెప్టెంబర్ 1న వివాహం చేసుకుంది. ఇద్దరు కలిసి హనీమూన్ కంటూ గోవా వెళ్లారు. అక్కడ శామ్ బాంబే .. పూనమ్ పై విచక్షణా రహితంగా దాడి చేయడం తీవ్ర కలకలకం రేపింది. తరువాత పూనమ్ అతడిపై గృహ హింస కేసు పెట్టడం.. తను రాజీకి రావడంతో కేసు విత్ డ్రా చేసుకోవడం తెలిసిందే.