thesakshi.com : దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ నాటకీయ ఫక్కీలో బుధవారం అరెస్టయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో భారీ ఎత్తున అవకతవకలకు, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. కేసులను విచారిస్తోన్న కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మేరకు రాంచీలో ఆమెను అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించింది. జార్ఖండ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇవాళ్టి అప్ డేట్స్ ఇవే..
జార్ఖండ్ మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్‌ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్‌కు ముందు ఈడీ ఆమెను చాలా గంటల పాటు ప్రశ్నించింది. జార్ఖండ్‌లో జాతీయ ఉపాధి హామీ పధకం నిధుల్లో అవకతవకలపై ఈడీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది. పూజా సింఘాల్ జార్ఖండ్‌లో మైనింగ్ కార్యదర్శిగా పనిచేస్తోంది.
జార్ఖండ్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్ రాం వినోద్ ప్రసాద్ సిన్హా మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన క్రమంలో ఇదే కేసులో పూజా సింఘాల్, ఇతరులపై ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఏప్రిల్ 2008 మార్చి 2011 మధ్య సిన్హా ప్రభుత్వ నిధులను తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినందుకు 2020 జూన్ 17న సిన్హాను బెంగాల్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.
జాతీయ ఉపాధి హామీ పధకం కింద ప్రభుత్వం చేపట్టే నిధులను సిన్హా కాజేశారనే ఆరోపణలున్నాయి. దారిమళ్లించిన నిధుల్లో తాను ఐదుశాతం కమిషన్ కింద జిల్లా అధికారులకు చెల్లించానని విచారణలో సిన్హా వెల్లడించారు. అప్పట్లో చత్ర, ఖుంటి, పలము జిల్లా డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించిన పూజా సింఘాల్ సహా పలువురిపై నిధులు స్వాహా చేశారనే అభియోగాలు నమోదయ్యాయని ఈడీ తెలిపింది.