thesakshi.com : ఇండోర్‌లో భార్య ప్రేమికుడిని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లయిన తర్వాత కూడా భార్య తన ప్రేమికుడితో మొదటి భర్తతో మాట్లాడేది. భర్త మాట వినకపోవడంతో ప్రియుడిని దారిలోకి తెచ్చుకునేందుకు భర్త సుపారీ ఇచ్చాడు. కిరాయి హంతకులు ప్రేమికుడిని హతమార్చారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య సంచలనం రేపిన విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అశ్విని యాదవ్ మృతదేహం బైపాస్‌లోని ఖాళీ మైదానంలో రక్తపు మడుగులో పడి ఉంది. అతడిని కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించే సరికి హత్య మిస్టరీ ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. 24 గంటల్లోనే హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుడు అశ్విని యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత దూరంగా ఉంటానని ఇద్దరూ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీని తర్వాత కుటుంబ సభ్యులు గోపాల్ పగారేతో అమ్మాయి పెళ్లి చేశారు. కానీ అశ్విని, అమ్మాయి ఇద్దరూ ఇందుకు అంగీకరించలేదు. ఒకరితో ఒకరు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ విషయం యువతి భర్త అయిన గోపాల్‌కు తెలిసింది.
అతడు తన తన భార్య, అశ్విని ఇద్దరికీ ఈ విషయం గురించి చెప్పిచూశాడు. మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇందుకు ఇద్దరూ అంగీకరించలేదు. వారి మధ్య వివాహేతర సంబంధం కూడా కొనసాగుతోంది. దీంతో గోపాల్ కసితో రగిలిపోయాడు. తన భార్యను వదలని అశ్వినిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం అతడిని హత్య చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తిని అశ్వినిని చంపేందుకు గోపాల్ లక్షన్నర రూపాయల సుపారీ ఇచ్చాడు.
రాజు లక్షన్నర రూపాయలకు అనార్, సునీల్‌తో కలిసి అశ్వినిని చంపేందుకు అంగీకరించాడు. ముగ్గురూ కలిసి అశ్వినిని వెంబడించారు. అశ్విని లోడింగ్ ఆటో డ్రైవర్. కిరాయికి సరుకులు తీసుకెళ్తానని చెప్పి రాజు అశ్వినిని పిలిచాడు. ఆ తరువాత ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో అతడిపై దాడి చేశారు. హత్యను బయటపెట్టిన పోలీసులు రాజు, అనార్‌లను అరెస్టు చేయగా సునీల్ పరారీలో ఉన్నాడు.