హాట్ టాపిక్ గా మారిన అనంత టౌన్ బ్యాంక్ ఎన్నికలు..
సర్వశక్తులూ ఒడ్డుతున్న రెండు ప్యానళ్లు..
మాజీ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ ను బలపరిచిన సిపిఐ, బిజెపి, జనసేన..
తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది అంటున్న జేఎల్ మురళి
ప్రజా బలంతో ప్రజాస్వామ్యయుతంగా గెలుస్తాం
గెలుపును అడ్డుకొంటాం అంటున్న ప్రత్యర్ధులు..
అనంతపురం టౌన్ బ్యాంక్ ఎన్నికలు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి… రెండు ప్యానళ్లు_ _ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల వేడిని రాజేశాయి..
రాజకీయ గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో అధికారపక్షం ఎన్నికల్లో పోటీ చేయలేదు… దీంతో తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి… ప్రస్తుత. అనంతపురం టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రముఖ తెలుగుదేశం నాయకులు, జెసి బ్రదర్స్ మద్దతు కలిగిన మాజీ టౌన్ బ్యాంక్ప్రెసిడెంట్ అన్ని ప్రతిపక్ష పార్టీల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది…
అయితే ప్రత్యర్థి వర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మద్దతు ఇస్తుడడం తో ఎన్నికలు రసవత్తరంగా మారాయి..ఇప్పటికే చంద్రదండు అధ్యక్షులు ప్రకాష్ , టిడిపి జిల్లా నాయకులు రాయల్ మురళి, కృష్ణ కుమార్ లతోపాటు పలువురు జేఎల్ తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. టౌన్ పార్టీఎన్నికల్లో జేఎల్ మురళి ప్యానల్ తరఫున సిపిఐ, జనసేన, బిజెపి పార్టీలు పోటీ చేస్తుండటం.గమనార్హం…జేఎల్ మురళికి పలుసార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అనుభవం ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతున్నది….. తన అనుభవాన్ని రంగరించి సీపీఐ పార్టీకి ఏకంగా మూడు డైరెక్టర్ అభ్యర్థి స్థానాలు, జనసేన కు … బిజెపికి ఒక్కొక్క అభ్యర్థి స్థానాలను పొత్తులో భాగంగా కేటాయించి ఓట్లు చీలిపోకుండా చేసుకోగలిగారు…జేఎల్ మురళి టౌన్ ప్రెసిడెంట్ కావడం నల్లేరు మీద నడక అని రాజకీయ_ _విశ్లేషకులు భావిస్తున్నారు..అందువల్లనే ఆయన ప్రత్యర్థి కూటమి నానాయాగీ చేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు..
గతంలో టౌన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే సమయంలోఆ బ్యాంకు నష్టాల బాటలో నడుస్తున్నది… ఒకానొక దశలో మరో బ్యాంక్ లో విలీనం చేయాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది… అయితే కోట్ల రూపాయల డిపాజిట్లు… రుణ గ్రస్తుల నుండి నగదు రికవరీ తదితర లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకు అధ్యక్షుడిగా మురళీ సఫలీకృతులయ్యారు…. అదీగాక తన సామాజిక వర్గంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తుండడంతో గెలుపు తనదేనని మురళి ఘంటాపథంగా చెబుతున్నారు… అయితే ప్రత్యర్థులు కూడా గత పాలకవర్గ హాయంలో అనేక అవకతవకలు జరిగాయని … స్వచ్ఛ పాలన కొరకే పోటీ చేస్తున్నామని ఎన్నికల ప్రచారంలో పేర్కొంటున్నారు… ఏది ఏమైనా ఈనెల 15వ తేదీన బ్యాంకు ఓటర్ల తీర్పు వెలువడనుంది.