thesakshi.com : ఈ నెల 19 తేదీ ఆదివారం 10-30 గంటల కు మహాత్మా జ్యోతిరావు పూలే” విగ్రహం జరుగునని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు తెలిపారు “సామాజిక న్యాయం కోసం దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ దీక్ష కు రాయలసీమ జిల్లాల నుంచి ప్రతినిధులు రావడం జరుగుతుంది.
ఇందులో భాగంగానే రాజకీయ పార్టీల ప్రతినిధులను,కుల సంఘాల ప్రతినిధులను,ప్రజా సంఘాల నాయకులను, రిజర్వేషన్ల ఉద్యోగుల సంఘాల నాయకులను,ఇతర సామాజిక ఉద్యమ నేతల ను,రచయిత లను,కళాకారుల, విద్యార్తి సంఘాల నాయకులను, ఆహ్వానిస్తున్నాము.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేక రాస్తున్నాము.
దేశంలో ను,రాష్ట్రంలో ను 56 % శాతం ఉన్న BC అభివృద్ధి పైన,సంక్షేమ ము పైన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అమలుకు, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలని,ఉన్నత న్యాయస్థానలలో నియామకాలు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకాలలో BC లకు రిజర్వేషన్ల పైన చట్టసభలలో BC లకు రిజర్వేషన్లను అమలు కు, జనాభా లెక్కలలో OBC కులాలను లెక్కింపు చేయాలని, కేంద్రం లోను,రాష్టాల లలో పనిచేస్తున్న BC కమీషన్ లను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రధాన మంత్రి కి లేఖలు రాయాలని పార్లమెంట్లో తమ పార్టీ ల పార్లమెంట్ సభ్యుల చేత డిమాండ్ చేయించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగానే ఈ నెల 19 తేదీ న అనంతపురం నగరంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద “సామాజిక న్యాయ దీక్ష” ను చేపట్టాలని RPS జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు నిర్ణయించడము జరిగింది.
ఈ దీక్ష ను విజయవంతం చేయడానికి రిజర్వేషన్ వర్గాల కు చెందిన నాయకులు, రాజకీయ పార్టీల నేతల విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్యక్రమం RPS మరియు REF ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సామాజిక న్యాయ దీక్షలు అనంతపురం, వైజాగ్, విజయవాడ,వరంగల్, హైదరాబాద్ లలో జరపాలని RPS జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు నిర్ణయం తీసుకున్నారు.