thesakshi.com : గత రెండు నెలలుగా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారు.. ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులురేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ వేదికగా బిజెపి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారు.
కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా నిన్న బీజేపీ నేతలకు సూచించారు.
నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు.
బిజెపి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలి.
తెలంగాణ సమాజాన్ని బిజెపి, టీఆర్ఎస్ రెండు కలసి మోసం చేస్తున్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు .
తెలంగాణలో చాలదు అన్నట్లు టీఆర్ఎస్, బిజెపి నేతలు ఢిల్లీ లో వీధి నాటకాలు మొదలు పెట్టారు
రబీ సీజన్ లో పండిన దానిని కొనుగోలు చేసే అంశంపై మాట్లాడకుండా మళ్లీ వర్షాకాలంలో పండే పంట గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు
రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప రైతాంగ ప్రయోజనాలను తప్ప కేసీఆర్ మరే ప్రయత్నం చేయడం లేదు.
టీఆర్ఎస్ , బిజెపి నేతలు వీధి బాగోతాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను పక్కదోవ పట్టించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు.
వరి ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారు.
కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి, సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్ లో నడుస్తున్నారు.
సునీల్ అనే వ్యూహకర్త బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు నాయకుడిగా మారారు.
త్వరలో అన్ని అంశాలను వివరిస్తాను.
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎం.పీ
గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చు.
తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసు. అయినా కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీవీసీ, సీబీఐ తో విచారణ జరిపించాలి.
తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ ల పెంపు పై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన అందలేదని నా ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దీన్నిబట్టి గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమం లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీమధు యాష్కీ గౌడ్ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్..లు పాల్గొన్నారు.