thesakshi.com : రాజకీయాలను ట్రెడిషనల్ రూట్ నుంచి మార్చే కొత్త దారుల్లోకి తెచ్చిన ఘనత జగన్ దే. ఆయన అందరూ నడిచే బాటలో నడవరు. ఆయన రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంటారు. ఇదిలా ఉంటే జగన్ ఇపుడు మూడేళ్ళ సీఎం గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం అయితే ఆయనలో స్పష్టంగా ఉంది. దానికి పరిస్థితులు ఎంతలా దోహదపడతాయి అన్నది చూడాలి. అయితే ఏపీలో తన బలం ఎంత విపక్షం బలం ఎంత అన్న దాని మీద జగన్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
ఏపీలో గడపగడపకు కార్యక్రమం వెనక ఉన్న కారణం అదే అంటున్నారు. వైసీపీకి జనాలలో ఉన్న ఆదరణ నిరాదరణ ప్రత్యక్షంగా తెలుసుకోవడమే దీని అసలు ఉద్దేశ్యం. దానితో పాటు అనేక ఇతర మార్గాల ద్వారా సర్వేలు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి అర్ధమైన విషయం ఒకటి ఉంది అంటున్నారు. అదే జనాల్లో స్వల్ప వ్యతిరేకత పై కారకులు ఎవరు అన్నది అన్వేషించే పనిలోనే ప్రభుత్వం మరియు పార్టీ,ఉంది.
ప్రభుత్వ పాలసీల్లో లోపాలు ఉంటే దాన్ని చక్కదిద్దుకోవాలని చూస్తోంది. అందుకే అభివృద్ధి విషయంలో రానున్న రెండేళ్ళ పాటు గట్టిగా కృషి చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే టైమ్ లో మంత్రుల మీద అసంతృప్తి ఉంటే దానికి కూడా విరుగుడు మంత్రం ఆలోచించారు అని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే విషయమే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.
గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ప్రశాంత్ కిషోర్ టీం నిఘా పెట్టింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు వద్దకు ప్రతిరోజు వెళ్లక తప్పనిసరి ఏర్పడింది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు నిలదీస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8 నెలల పాటు ప్రజల మధ్యే గడపాలని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం మరోసారి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ (పీకే) టీం నిఘా పెట్టినట్టు అధికార పార్టీ నేతలు గుర్తించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు? చిత్తశుద్ధితో ప్రజలను కలుస్తున్నారా? నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందా? ఒకవేళ వస్తుందో, ఎందుకు, ఎక్కడి నుంచి తదితర కారణాలను ఎప్పటికప్పుడు పీకే టీం సీఎం కార్యాలయానికి నివేదిస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఎక్కువ వ్యతిరేకత అయితే గ్రౌండ్ లెవెల్ లో వస్తోంది అని అంటున్నారు. దానితో పనిచేయని వారిని తప్పించేసి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలన్న ఆలోచన పార్టీలో ఉందిట. ఈ విషయాలను జగన్ ప్లీనరీలోనే ప్రకటించి సంచలనం రేపుతారని అంటున్నారు. అంటే రెండేళ్ళ ఎన్నికలకు ముందే కొత్త అభ్యర్ధిని కొన్ని నియోజకవర్గాలలో ప్రకటించడం అన్న మాట.
ఇది నిజంగా కొత్త ప్రయోగం కాదు షాకింగ్ ప్రయోగంగా చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా రేపటి ఎన్నికల్లో నేనే అభ్యర్ధిని అని వేరే వారు చెప్పుకుంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఉన్నట్లుగా సీన్ ఉంటుంది. అంతే కాదు వర్గ పోరు కూడా పీక్స్ లో ఉంటుంది. కొత్త అభ్యర్ధి ఫీల్డ్ లోకి వచ్చి దున్నేస్తే సిట్టింగ్ ఎమ్మెలెయ డమ్మీ అయిపోతారు.
మరి ఇంతటి ప్రమాదం ఉంటుందని తెలిసినా వైసీపీ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటోంది అన్నదే ఆసక్తికరమైన చర్చ. పనిచేయని వారిని మరో రెండేళ్లు ఉంచుకున్నా పెంచుకున్నా ఏమిటి ఉపయోగం అన్నదే అధినాయకత్వం ఆలోచనగా ఉంది అంటున్నారు. అదే వారిని పక్కన పెట్టేసి కొత్త వారినే దింపితే ఫలితాలు బాగుంటాయని వారు కూడా జనాల్లోకి ఇప్పటి నుంచి వెళ్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
పీకే టీం నివేదిక ఆధారంగా కొందరు ఎమ్మెల్యే, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను వైసీపీ పెద్దలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారని సమాచారం. ఫలానా చోట ఎందుకు ఇలా చేశారు? అక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ఆ తప్పును సరి చేయండి అంటూ వైసీపీ పెద్దలు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారని సమాచారం.
ఎన్నికల వేళకు కాస్తా ముందు మార్చితే వెళ్ళిపోయే వారు భారీ నష్టం చేస్తారని ఇపుడే వారికి చెబితే ఉంటే ఉంటారు లేకపోతే నష్టం కూడా పెద్దగా ఉండదని దాన్ని పూడ్చుకోగలమని భావిస్తున్నారుట. ఏది ఏమైనా ఇది సరికొత్త ప్రయోగం దేశ రాజకీయ చరిత్రలో ఒక అధికార పార్టీ చేయని ప్రయోగం మరి వైసీపీ ప్లీనరీలో దీనిని అమలు చేయలని చూస్తోందిట. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో అలా చేస్తారట. చూడాలి మరి.