thesakshi.com : నేటితరం నాయికలతో పోటీపడుతూ సీనియర్ నటి కంగన రనౌత్ తన రేంజును ఎక్కడా తగ్గకుండా మెయింటెయిన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు నెపోటిజం ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ మాఫియాకు ఎదురెళ్లిన కంగన నిరంతరం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా మారుతోంది. అంతేకాదు.. నేటి ట్రెండీ సోషల్ మీడియా యుగంలో యంగ్ గ్లామరస్ డాళ్స్ తో పోటీపడడం ఎలానో కూడా కంగనకు బాగా తెలుసని నిరూపిస్తోంది.
క్వీన్ కంగన రనౌత్ తాజాగా షేర్ చేసిన ఓ త్రోబ్యాక్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఒకే ఒక్క ఫోజ్ తో బ్లోఅవుట్ లా మరిగించింది అంటూ దీనిపై యూత్ కామెంట్లు చేస్తున్నారు. మ్యాడ్ నెస్ ఓవర్ లోడెడ్ అన్న తీరుగా కంగన ఇచ్చిన ఈ ఫోజు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
పనిలో పనిగా తన సినిమాల ప్రమోషన్స్ లో ఉన్న కంగన తన ప్రత్యర్థులను ఒక రేంజులో ఆడుకుంటోంది. తాజాగా కంగనా రనౌత్ నెట్ఫ్లిక్స్ ను విమర్శించింది.. కరణ్ జోహార్ పని తీరును అపహాస్యం చేసింది. భారత మార్కెట్ లో 90ల నాటి గాసిపీ దర్శకుడు అతడు.. అంటూ కరణ్ ని ఆడుకుంది. కొత్త ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కంగనా రనౌత్ నెట్ ఫ్లిక్స్ భారతీయ ప్రేక్షకులను అర్థం చేసుకోలేకపోయింది! అంటూ నిందించింది. నిర్మాత పేరు చెప్పలేకుండానే అతడిపై పంచ్ లు వేసింది. నెట్ ఫ్లిక్స్ ను ప్రత్యర్థి మాధ్యమమైన అమెజాన్ ప్రైమ్ వీడియోతో పోలుస్తూ తక్కువ చేసే ప్రయత్నం చేసింది. రెండోది మరింత ఓపెన్ మైండెడ్ అలాగే డెమోక్రటిక్ అని అమెజాన్ పై ప్రశంసలు కురిపిస్తూ నెట్ ఫ్లిక్స్ ని విమర్శించింది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చీఫ్ బేలా బజారియా కోసం ఇటీవల కరణ్ నిర్వహించిన పార్టీని ప్రస్తావిస్తూ.. అతడిపైనా కంగన స్పష్టంగా విరుచుకుపడింది. కంగనా తొలి ప్రొడక్షన్ `టికు వెడ్స్ షేరు` అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
ఇన్ స్టా వేదికగా కంగనా నెట్ ఫ్లిక్స్ CEO రీడ్ హేస్టింగ్స్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావించింది. భారతదేశంలో చందాదారుల పెరుగుదల లేకపోవడం వల్ల కంపెనీ విసుగు చెందిందని కంగన విమర్శించింది. “అమెజాన్ ప్రైమ్ వీడియో భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని డేటా సూచిస్తోంది. ఎందుకంటే వారు చాలా ఓపెన్ మైండెడ్ .. డెమోక్రటిక్ గా ఉంటారు. అంతర్జాతీయ హెడ్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారు 90ల నాటి దర్శకుల అపఖ్యాతి పాలైన పార్టీలో చేరారు. వారు ప్రతి ఒక్కరినీ కలుసుకుంటారు కానీ చివరికి అపఖ్యాతి పాలైన వారికి సహకరిస్తున్నాను… నెట్ఫ్లిక్స్ అధినేత భారతీయ మార్కెట్ ను అర్థం చేసుకోలేకపోయారని నేను విన్నాను… సరే.. భారతీయ మార్కెట్ కేవలం ఒక బిచ్ గాసిపీ నైంటీస్ డైరెక్టర్ కాదు…. ఇక్కడ వందలాది మంది ప్రతిభావంతులున్నారు’’ అని కంగనా వరుసగా మాటల తూటాలతో విరుచుకుపడింది.
గత ఆదివారం నాడు కరణ్ నెట్ ఫ్లిక్స్ అంతర్జాతీయ అధినేత బేలా కోసం పార్టీని నిర్వహించాడు. దీనికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల జాబితాలో షారూఖ్ ఖాన్- మాధురీ దీక్షిత్- ఫర్హాన్ అక్తర్- శిబానీ దండేకర్- రణవీర్ సింగ్- అలియా భట్- సారా అలీ ఖాన్- కృతి సనన్- మనీష్ మల్హోత్రా- శశాంక్ ఖైతాన్ – సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఉన్నారు. యాధృచ్ఛికంగా గురువారం ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్ ఈవెంట్ కు కరణ్ జోహార్ హోస్ట్ గా ఉన్నారు అదే ఈవెంట్ లో కంగనా చిత్రం `టికు వెడ్స్ షేరు`ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నిజానికి కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ – ధర్మాటిక్ రెండూ అమెజాన్ ప్రైమ్ కోసం భారీ సినిమాలు.. వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. వాటి విడుదల కోసం ప్రైమ్ వీడియోతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. కానీ కంగన కరణ్ ని నెట్ ఫ్లిక్స్ తో ముడిపెడుతూ విమర్శించడం ఆసక్తికరం.
`టికు వెడ్స్ షేరు`తో కంగనా పూర్తిగా సినీనిర్మాణ రంగంలో ప్రవేశించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ- అవ్ నీత్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రానికి రివాల్వర్ రాణి ఫేమ్ సాయి కబీర్ దర్శకత్వం వహించారు. కంగనా ఈ చిత్రాన్ని జీవితంలో అందం క్రూరత్వం మధ్య ప్రేమకథ అని అభివర్ణించింది.