thesakshi.com : అనుమానాస్పద స్థితిలో కువైట్ గంగాధర్ రెడ్డి మృతి..
అతిగా సేవించడం వల్లే మృతి..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సి.బి.ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన కువైట్ గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు… మద్యం అతిగా సేవించడం వల్లే మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి… పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన విషయం తెలిసిందే…. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన యాడికి లో వివాహం చేసుకుని అక్కడే గంగాధర్రెడ్డి నివాసముంటున్నారు…. రాత్రి అతిగా మద్యం సేవించి నిద్రించినట్లు తెలుస్తోంది … గంగాధర్ రెడ్డి మృతి పై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు..