thesakshi.com : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీలోని సీనియర్ నేతలకు యువకులకు బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఒంగోలు పట్టణంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం వార్షిక సర్వసభ్య సమావేశం – మహానాడు – ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి నాయుడు పార్టీని బలోపేతం చేయడానికి యువరక్తం నింపాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, 2024 ప్రారంభంలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు 40% పార్టీ టిక్కెట్లను యువకులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
వచ్చే 2024 ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నా రు. నేడు ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేడు పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. గత పాలనకు ఇప్పటి పాలనకు మధ్య పోల్చి చూసుకోవాలని.. చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ISBలో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ISB.. హైదరాబాద్కు వచ్చింది. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోంద, చేతకాని దద్దమ్మ పరిపాలన వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ఏపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మహానాడు సభా ప్రాంగణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మహానాడుకు హాజరయ్యే ముందు ఆయన మండవవారిపాలెం గ్రామానికి వచ్చారు. గ్రామస్థులందరూ పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
మహానాడు సభ నిర్వహణకు వేదిక దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో మండవవారిపాలెం గ్రామస్థులు ముందుకు వచ్చి.. తమ పొలాల్లో కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు చంద్రబాబు స్వయంగా ఆ ఊరికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ చంద్రబాబును ఘనంగా సన్మానించారు.