thesakshi.com : టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అభివృద్ధి సాధనం ఏంటో చూపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారని గుర్తు చేశారు. బీసీ మంత్రులను చంద్రబాబు డమ్మీని చేశారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కొనియాడారు. ఎన్నికలకు ముందు కమిటీలు వేసి పరిస్థితిని పరిశీలించామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో సామాజిక విప్లవం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఎక్కడా వెనుకబడిన వర్గాలకు పదవులు దక్కలేదని, అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పెద్దిరెడ్డి అన్నారు. బస్సుయాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని, టీడీపీ మహానాడుకు పోటీ కాదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాలు మానుకోవాలని నాయుడుకు సూచించారు.