thesakshi.com : ఐటీ హబ్ లో పనిచేస్తున్న యువతీ యువకుడు ప్రేమలో పడ్డారు. పెళ్లికి ఓకే అనుకొని విహార యాత్రలకు వెళ్లి తెగ ఎంజాయ్ చేసి వచ్చారు.ఇక పెళ్లికి ఓకే అనడంతో ‘ఆ ముచ్చట’ తీర్చేసుకొని శారీరకంగా ఒక్కటయ్యారు. పెళ్లికి పెద్దలు అంగీకరించరని రహస్యంగా .పెళ్లి చేసుకొని ఆ తర్వాత వారికి చెబుదామని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెళ్లికి స్నేహితుల సాయంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడే వారికి గట్టి షాక్ తగిలింది.
పెళ్లికి మరో గంట ముందు ప్రియురాలు హ్యాండ్ ఇచ్చింది. నేను పెళ్లి చేసుకోను అంటూ రివర్స్ అయ్యింది. ప్రియురాలిని ఒప్పించడానికి ప్రియుడు నానా అగచాట్లు పడ్డాడు. ప్రియురాలు మాత్రం పెళ్లి ససేమిరా అన్నది. ప్రియురాలు తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన చెందిన ప్రియుడు డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు స్నేహితులు షాక్ కు గురయ్యారు. బెంగళూరులోని చాముండేశ్వరి లేఔట్ లో ఈ దారుణం జరిగింది.
బెంగలూరులో చరణ్ (25) అనే యువకుడు నివాసముంటున్నాడు. అక్కడే ఉండే యువతితో చరణ్ కు పరిచయమైంది. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం కావడంతో చనువు పెరిగి ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని చెట్టాపట్టాలేసుకొని విహారయాత్రలకు తిరిగారు. శరీరకంగా కలుసుకున్నారు.
అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించరని రహస్య వివాహానికి రెడీ అయ్యారు. ధర్మస్థలంలో పెళ్లికి అంతా సిద్ధం చేయగా.. గంట ముందు యువతి హ్యాండ్ ఇచ్చింది. ప్రియురాలిని ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. నిన్ను పెళ్లి చేసుకోను అంటూ చరణ్ కు చెప్పేసింది. దీంతో చరణ్ తట్టుకోలేకపోయాడు. ఫ్రెండ్స్ ముందు పరువు పోయి తలకొట్టేసినంత పని అయ్యింది.
చరణ్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు ధర్మస్థలం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయింది. ప్రియురాలు నమ్మించి అందరి ముందు మోసం చేసిందని బాధపడ్డ చరణ్ ఆవేదనతో తన ఇంటికి వచ్చి డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అతడి కుటుంబ సభ్యులు స్నేహితులు షాక్ అయ్యారు.