thesakshi.com : ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే ఆ యువతి కూడా మనసుకు నచ్చిన వాడినే మనువాడాలని భావించింది. అతడి కులం వేరైనా తల్లిని ఒప్పించింది. అంతా సరే అనుకున్నట్లే జరుగుతుందని.. ప్రేమించిన వాడితోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని భావించింది. కానీ పెళ్లికి సిద్ధమైన అతడు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో తట్టుకోలేకపోయిన యువతి.. నరకయాతన అనుభవించలేక కఠిన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన పటేల్ నగర్ కు చెందిన హనుమంతు సాయిరాం చేస్తూ కొన్నేళ్ల క్రితం చనిపారు. దీంతో ఆయన భార్య శివపార్వతి కోర్టులో ఉద్యోగం చేస్తూ ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసింది.
ప్రస్తుతం పెద్దకుమార్తె శ్రావణి ఓ కాలేజీలో ఎల్.ఎల్.బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీతో తన క్లాస్ మేట్ అయిన తేజను ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించింది. కులాలు వేరైనా కుమార్తె ప్రేమను తల్లి అంగీకరించింది. అంతా సవ్యంగా జరుగుతందనుకున్న సమయంలో తేజ బాంబు పేల్చాడు. పెళ్లి చేసుకోవాలంటే రూ.15 లక్షలు కట్నంగా తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న శ్రావణి.. ప్రస్తుతం తమ దగ్గర అంత డబ్బులేదని చెప్పింది. ఐతే పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పిన తేజ.. తనను మర్చిపోవాలన్నాడు.
ప్రియుడు అలా అనడం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శ్రావణి కొన్ని రోజులుగా రూమ్ కే పరిమితమైంది. తల్లి, చెల్లెలు ఆమెకు ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఐతే ఈనెల 6న ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అడ్మిట్ చేసుకోలేదు. అక్కడి నుంచి బాపట్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
చివరకు…
ప్రేమిస్తే పోయేదేముంది అనుకున్నాడు. ఎంచక్కా ప్రేమించాడు. అమ్మాయిలో ఆశలు రేపాడు. పెళ్లి అనేసరికి మాత్రం ప్లేటు ఫిరాయించాడు. ప్రేమ ఫ్రీ, పెళ్లి మాత్రం కాస్ట్ లీ అంటూ కండిషన్లు పెట్టాడు. దీంతో మానసిక వేదనకు గురైన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. బాపట్లలో జరిగింది ఈ ఘటన.
బాపట్లలో ఉంటున్న శివపార్వతికి ఇద్దరు కుమార్తెలు. భర్త చనిపోవడంతో తనే కష్టపడుతూ పిల్లలిద్దర్నీ పెంచి పోషిస్తోంది. పెద్దమ్మాయి స్థానికంగా లా డిగ్రీ చదువుతోంది. తన కాలేజీలోనే తేజ అనే కుర్రాడ్ని ప్రేమించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తేజను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని ఇంట్లో చెప్పింది అమ్మాయి. కులాంతర వివాహం అయినప్పటికీ, కూతురు సంతోషం కోసం తల్లి శివపార్వతి అంగీకరించింది.
అంతా ఓకే అనుకున్న టైమ్ కు తేజ రివర్స్ అయ్యాడు. 2 నెలలుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రేమ వరకు ఓకే కానీ, పెళ్లి చేసుకోవాలంటే మాత్రం 15 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కట్నం అడిగాడు. ప్రస్తుతం అంత డబ్బు తమ వద్ద లేదని చెప్పడంతో ప్రేయసిని దూరం పెట్టాడు.
తేజ తనను దూరం పెట్టడంతో ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయింది. తల్లి, చెల్లి ధైర్యం చెప్పినప్పటికీ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో మరింత కుంగుబాటుకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించింది.
కుమార్తె మరణంతో ఆ తల్లి, చెల్లెలు బాధ వర్ణనాతీతం. ఇప్పటికే ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం, ఇప్పుడు పెద్ద కూతుర్ని కూడా కోల్పోయింది. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తేజ పరారీలో ఉన్నాడు.