thesakshi.com : మావోయిస్టు సమ్మక్క అలియాస్ శారదా లొంగుబాటు-డీజీపీ మహేందర్ రెడ్డి
1995లో కొత్తగూడెం పాండవదళం హరీష్ భూషణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు.
మైనర్ గా సమ్మక్క పాండవదళంలో జాయిన్ అయ్యారు.
హరిభూషన్ తోనే సమ్మక్క వివాహం చేసుకున్నారు.
పాండవదళం నుంచి కిన్నెరదళం కు మారారు.
2000- 04 వరకు సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ లో పనిచేశారు.
2001లో ఏరియా కమిటీ మెంబర్ గా ప్రమోషన్ పొందారు.
చెర్ల LOS కమాండర్ గా పనిచేశారు.
2008లో వరంగల్ SP దగ్గర లొంగిపోయారు.
2011లో మళ్ళీ దళంలోకి రావాలని హరిభూషన్ నుంచి పిలుపు.
2011 నుంచి 2016 వరకు హరిభూషన్ తో దళంలో పనిచేశారు.
2016లో సమ్మక్కకు ప్రమోషన్- DVC మెంబర్ గా మళ్ళీ ప్రమోషన్ పొందారు.
హరిభూషన్ భార్య కావడంతో పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది.
హరిభూషన్ మరణంతో సమ్మక్క లొంగిపోయారు.
25 ఏళ్ళు పోరాటం చేసినా మావోయిస్టు ఉద్యమం వల్ల ప్రయోజనం లేదని సమ్మక్క అంటోంది.
ఆరు నెలల కాలంలో పార్టీ నుంచి 20 మంది లీడర్లకు చెప్పకుండా వెళ్లిపోయారు!.
వెళ్లిన వాళ్ళను బలవంతంగా మళ్ళీ పార్టీలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
సమ్మక్క 45 ఏళ్లుగా తను పనిచేసిన ఏరియాపై పట్టు సాధించారు.
మావోయిస్టు ప్రణాళికలు ప్రస్తుత సమయంలో సక్సెస్ కావని సమ్మక్క చెప్పారు.
25 కేసుల్లో సమ్మక్క ప్రత్యేక్షంగా ఉన్నారు- 6 పోలీసుల ఎదురు కాల్పుల్లో సమ్మక్క ఉన్నారు.
ఒకసారి జరిగిన ఎదురుకాల్పుల్లో సమ్మక్కకు బులెట్ గాయం.
100కు పైగా ఉన్నా తెలంగాణ స్టేట్ కమిటీలో 14మంది తెలంగాణ- 11మంది ఏపీకి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు.
కొరొనా సమయంలో సరైన వైద్యం లేకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసారు.
ఆజాద్- రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ ఆరోగ్యం బాగాలేదని బయటకు రావాలని ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
బయటకు రావాలని అనుకుంటున్న మావోలు పోలీసుల సహకారం ఉంటుంది.
మావోయిస్టు నేతలు జనజీవనంలో కలవాలని కోరుతున్నా- డీజీపీ.
సమ్మక్క లొంగుబాటుకు ఆమెకు 5లక్షల రివార్డు-
మావోయిస్టు పార్టీ విపత్కరమైన పరిస్థితిలో ఉంది.
ఒకటి రెండు క్యాడర్స్ నుంచి మాకు సమాచారం ఉంది- కానీ అక్కడ దళం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
పార్టీలో కరోనా వల్ల 10మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు నేతలు కరోనా వల్ల మృతి చెందుతున్నట్లు బయటకు చెప్పడం లేదు.
తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులందరూ చత్తీస్ ఘడ్ లో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో న్యూ రీక్యూటిమెంట్ మాత్రం లేదు.
తెలంగాణ ప్రజలు మావోయిస్టులకు సహకారం ఇవ్వడం లేదని వాళ్లే చెప్తున్నారు.
లొంగిపోయిన మావోలకు భద్రత కల్పిస్తాం- ఎలాంటి భయం అవసరం లేదు.
ఏజెన్సీ ఏరియాల్లో అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారు.
మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 25మంది ఉన్నారు- 11మంది తెలంగాణ, 3ముగ్గురు ఏపీ నుంచి.
తెలంగాణ-ఏపీ పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాము.