thesakshi.com : రాజంపేట పార్లమెంట్ పరిధిలో మరో మెగా జాబ్ మేళాకు శ్రీకారం
ఇప్పటికే పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించి 4 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
మార్చ్ 19న రైల్వే కోడూరు నియోజకవర్గం లో మెగా జాబ్ మేళా
మెగా జాబ్ మేళా నిర్వహణకు రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు
ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవ తో జాబ్ మేళా కు 32 కంపెనీలు
హాజరుకానున్న ఫాక్స్కాన్, టిసీఎల్, అమర్ రాజ బ్యాటరీస్, అపోలో ఫార్మసీ, హెట్రో డ్రగ్స్, భారత్ ఎఫ్ ఐ హెచ్ వంటి సంస్థలు
ఇప్పటికే జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 3500 మంది నిరుద్యోగులు
ఈ మంచి అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి : ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా బల పడాలంటే ఉద్యోగమే మార్గం : ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
అందుకే ఉద్యోగాల కల్పన కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అధ్వర్యంలో మరో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించి 4 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన విషయం విదితమే. అయితే ఈ నెల 19న రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపి ఆదేశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవ తో జాబ్ మేళా కు 32 కంపెనీలు హాజరుకానున్నాయి. ఇందులో ఫాక్స్కాన్, టిసీఎల్, అమర్ రాజ బ్యాటరీస్, అపోలో ఫార్మసీ, హెట్రో డ్రగ్స్, భారత్ ఎఫ్ ఐ హెచ్ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఈ జాబ్ మేళా కు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటికే సుమారు 3500 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 7వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారి నుండి పీజీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారి వరకు ఈ జాబ్ మేళా లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్ లేదా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నాయి కంపెనీలు. జాబ్ మేళా లో స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉండటంతో మరింత మంది యువత హాజరవుతారని తెలుస్తుంది. ఎమ్మెల్యే కే శ్రీనివాసులు అధ్వర్యంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు నిరుద్యోగ యువతను జాబ్ మేళాకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
ఈ మంచి అవకాశాన్ని యువత వినియోగించుకోవాలిని పిలుపునిచ్చారు ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రక్రియ ద్వారా నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడాలాని శ్రమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఈ ఉద్యోగాలు లభిస్తే వారు సమాజంలో ఉన్నత స్థితికి చేరుతారని స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగాల కల్పన కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.