thesakshi.com : కర్నూలు జిల్లాకు జగన్ … మెగా పవర ప్రాజెక్ట్ కు శంకుస్థాపన..
ముఖ్యమంత్రి ఉదయం 11.35 గంటలకు ఓర్వకల్ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గుమ్మితం తండాలోని 5,230 మెగావాట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. తండా, ఓర్వకల్ విమానాశ్రయాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు జగన్ పర్యటన కర్నూలు జిల్లాలో కొనసాగనుంది.
శ్రీలంక పరిస్థితికి కూతవేటు దూరంలో ఏపీ: జగన్ పొత్తుల విమర్శలపై పవన్ కళ్యాణ్ చురకలు శ్రీలంక పరిస్థితికి కూతవేటు దూరంలో ఏపీ: జగన్ పొత్తుల విమర్శలపై పవన్ కళ్యాణ్ చురకలు
ఒకే యూనిట్ నుండి సోలార్, విండ్, హైడల్ పవర్ లను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్ట్..ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత. ప్రపంచంలోనే మూడు విభాగాల ద్వారా ఒక యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. గ్రీన్ కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ను ఉత్పత్తి చేయనుంది. దీని నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం 4766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల ఎకరాలను కంపెనీకి అప్పగించింది.
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3వేల మెగావాట్లు, విండో 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మొత్తం 5230 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్ కు అనుసంధానం నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదు సంవత్సరాలలో పూర్తి చేసి విద్యుత్తు ఇస్తారు ఇక ఈ పవర్ ప్రాజెక్టు వల్ల 23 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాత ఫిబ్రవరి 2018లో గ్రీన్‌కో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ప్రాజెక్ట్ కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది. ప్రాజెక్ట్ యొక్క పంప్-స్టోరేజ్ కాంపోనెంట్ కోసం వివరణాత్మక డిజైన్ మరియు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ మార్చి, 2020లో ఇవ్వబడింది. ఇక తాజాగా నేడు మంగళవారం పదిహేను వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.