thesakshi.com : వినాయకచవితి పండుగ రోజున..ఊహించని రీతిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరిని షాక్ కు గురి చేసింది. స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాదాపూర్ రోడ్డులో యాక్సిడెంట్ కు గురి కావటం.. తీవ్రంగా గాయపడటం తెలిసిందే. తొలుత మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను మాదాపూర్ పోలీసులు విడుదల చేశారు.
ఇందులో తేజ్ రోడ్డు ప్రమాదం ఎంత తీవ్రమైనదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. వేగంగా బైక్ మీద వస్తున్న సాయి ధరమ్ తేజ్ బైక్.. తన ముందున్న బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న ఆయన బైక్ ను వంపుగా తిప్పటం.. ముందు చక్రం స్కిడ్ కావటంతో బండి బ్యాలెన్స్ తప్పింది. కేవలం రెండు సెకన్ల వ్యవధిలో ఆయన బైక్ పట్టుతప్పి కిందకు పడటం.. వేగంగా వెళుతున్న బైక్.. ఆయన్ను కొంత దూరం మేర ఈడ్చుకెళ్లింది.
ఆ సందర్భంలో ఆయన తలకు ఉన్న హెల్మెట్ ఎగిరిపోయింది. లక్కీగా తలకు గాయాలు తగల్లేదు. దీంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. కానీ.. కాలి వేలికి బలమైన గాయంతో పాటు.. ఛాతీ మీద మొత్తం మూడు పెద్ద దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగినంతనే.. షాక్ కు గురైన నేపథ్యంలో అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ చూసిన తర్వాత.. మన రోడ్లు అతి వేగానికి ఏ మాత్రం సూట్ అయ్యేలా డిజైన్ చేయలేదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక బులిటెన్ మాత్రం విడుదల కాలేదు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాయి ధరమ్ తేజ్ నడిపిన బైక్ మీద ఇప్పటికే ఒక చలాన్ పెండింగ్ లో ఉన్నట్లుగా గుర్తించారు.
తాజా ప్రమాదం అతి వేగం కారణంగానే జరిగిన విషయం తెలిసిందే. తన ముందు వెళుతున్న వాహనాల్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో.. బైక్ స్కిడ్ కావటంతో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో జరిగే ప్రమాదానికి సంబంధించిన తీవ్రత ఎంతో ఎక్కువగా ఉంటుంది. తలకు హెల్మెట్ ఉండటం.. అతడి ప్రాణాల్ని కాపాడిందని చెప్పాలి.
ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అతడు రైడ్ చేస్తున్న బైక్ మీద ఇప్పటికే ఒక చలాన్ పెండింగ్ లో ఉంది. ఆగస్టు 2న ఒక చలాన్ పడింది. దానికి కారణం.. ఓవర్ స్పీడ్. స్పోర్ట్స్ బైక్ కావటం.. సెకన్ల వ్యవధిలో భారీ వేగంతో దూసుకెళ్లే ఈ తరహా బైకు మీద వెళ్లటం చాలా మందికి ఫ్యాషన్. అయితే.. మనకున్న రోడ్ల నాణ్యతను చూసినప్పుడు.. ఇది ప్రాణంతో చెలగాటంగా చెప్పక తప్పదు.
తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో మంచి చెడుల గురించి చూస్తే.. మితిమీరిన వేగం ప్రమాదానికి అసలు కారణంగా చెప్పాల్సి వస్తే.. హెల్మెట్ పెట్టుకోవటం తేజ్ చేసిన అతి మంచి పనిగా చెప్పక తప్పదు. ఆయన ప్రమాణిస్తున్న రోడ్డు మీద గంటకు 40 -50 కిలోమీటర్ల స్పీడ్ కు మించి వెళ్లే పరిస్థితి లేదు. ట్రాఫిక్ తక్కువగా ఉన్న వేళలో.. గంటకు 60 కి.మీ. స్పీడ్ తో వెళుతుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ నడుపుతున్న బైక్ స్పీడ్ గంటకు 70కి.మీ. కంటే ఎక్కువ వేగంతోనే వెళ్లి ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
కేవలం సెకనులో జరిగిన ప్రమాదం.. మూడు నుంచి ఐదు సెకన్ల వ్యవధిలో అతడు అపస్మారక స్థితిలోకి జారిపోవటం గమనార్హం. ప్రమాదం జరగనంత వరకు దాని తీవ్రత ఎంతలా ఉంటుందన్న విషయాన్ని అస్సలు అంచనా వేయలేరు. తేజ్ యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలిస్తే.. అతి వేగం.. బండి నియంత్రణను మిస్ కావటంతో పాటు.. బండిని వంపుగా తిప్పటంలో జరిగిన చిన్న పొరపాటు.. బండిని స్కిడ్ అయ్యేలా చేసింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్.. తలకు హెల్మెట్ ఉంది. కానీ.. కింద పడిపోయిన వేళలో.. తలకు ఉన్న హెల్మెట్ వీడిపోయి.. కొంత దూరాన పడిపోయింది. ఎందుకిలా జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. తలకు హెల్మెట్ పెట్టుకున్నా.. చాలామంది కింద ఉన్న స్ట్రిప్ ను పెట్టుకోకుండా వదిలేస్తుంటారు. చట్ట ప్రకారం చూస్తే.. తలకు హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో..కింద ఉన్న స్ట్రిప్ ను తగిలించుకోవటం అంతే ముఖ్యం.
చాలామంది హెల్మెట్ పెట్టుకునే వాహనదారులు..ఈ స్ట్రిప్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అంత ప్రమాదం జరగదన్న ధీమాతో పెట్టుకోరు. కానీ.. హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో.. స్ట్రిప్ తగిలించుకోవటం అంతే ముఖ్యం. తాజా ప్రమాదంలో లక్కీగా తేజ్ హెల్మెట్ ఊడి కిందకు వచ్చేసినప్పటికి.. తలకు ఎలాంటి గాయం తగలకపోవటం గమనార్హం.
రోడ్డుప్రమాదానికి గురైన మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందన్న ప్రశ్నకు తాజాగా అధికారిక సమాచారం వెల్లడైంది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వేళలో.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వెంటనే.. సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లటం మెగా అభిమానుల్ని కలవరపెట్టింది. టెన్షన్ కు గురి చేసింది. తొలుత మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన ఆయన్ను.. తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలోకు షిప్టు చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైఅపోలో ఆసుపత్రి మీడియాకు ఒక బులిటెన్ ను విడుదల చేసింది.
తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని.. అది పెద్ద సమస్య కాదని వైద్యులు పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శనివారం ఉదయానికి తేజ్ మాట్లాడతారని.. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్ తప్పనిసరిగా కోలుకుంటాడని.. ఎవరూ టెన్షన్ పడొద్దని అపోలో వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
తేజ్ కుటుంబ సభ్యులంతా అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికి.. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెప్పారు. ఆయన త్వరగానే రికవరీ అవుతారన్న మాట వినిపిస్తోంది. శుక్రవారంఅర్థరాత్రి దాటిన తర్వాత సాయి ధరమ్ తేజ్ స్ప్రహలోకి వచ్చారని.. మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం ఈ సమాచారన్నిఎవరూ వెల్లడించటం లేదు.