THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

అమిత్ షా పై మంత్రి హరీశ్ రావు ఫైర్

thesakshiadmin by thesakshiadmin
May 16, 2022
in Latest, Politics, Slider
0
అమిత్ షా పై మంత్రి హరీశ్ రావు ఫైర్
0
SHARES
60
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   బిజెపి, అమిత్ షా పై మంత్రి హరీశ్ రావు ఫైర్.

అమిత్ షా కాదు అబద్ధాల షా..
అబద్ధాలకు బాద్ షా..
మిత్ షా..

అలవోకగా అబద్ధాలు మాట్లాడారు.
అమిత్ షా వచ్చి జూటా మాటలు చెప్పి వెళ్లారు.

ఇది గుజరాత్ కాదు. అమాయకులైన తెలంగాణ కాదు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ గడ్డ.

ఇక్కడ నీ అబద్ధాలు నడవవు. తెలంగాణలో నీ అబద్ధాలు చెల్లవు.

మీకు దమ్ము, దైర్యం ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పు.

1, ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపింది. ఇది వాస్తవం. మా ఎంపీలు ఓటు కూడా వేశారు.

2, మిషన్ భగీరథ కు కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది అన్నారు. నిజం చెప్పండి. వాస్తవాలు మాట్లాడండి. 2 రూపాయలు అయినా ఇచ్చారా. ఆధారం చూపండి. సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు ఇంచిందని కేంద్రం కూడా చెప్పింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం చెప్పింది.

3, ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు అన్నారు. ఇది అబద్దం. 18, మే 2021 నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్నం. పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి తుడు అమలు చేస్తున్నారు అని స్పష్టం చేశారు.

ఒకరేమో అమలు అవుతుంది అంటారు.. మరొకరు కాదు అంటారు పచ్చి అబద్దం మాటలు.

ఇప్పటి వరకు ఈ పథకం కింద 3.62 వేల మందికి చికిత్స చేయడం జరిగింది. 850 కోట్లు ఖర్చు కాగా. ఇందులో కేంద్రం 150 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ 700 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం 26 లక్షల మందికి ఇస్తే మేము 87. 60 లక్షల మందికి ఇస్తున్న. ఇక్కడ అమలు కాలేదు అంటున్నారు.. మరి కానప్పుడు ఎందుకు 150 కోట్లు ఇచ్చారు.

మీ స్క్రిప్ట్ బాగోలేదు. పార్లమెంట్ లో చెప్పింది నిజం. అమిత్ షా చెప్పింది అబద్దం.

4, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయలేదు అన్నారు. 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు 2679 కోట్లకు శంకుస్థాపన చేశారు. లోకల్ బిజెపి నాయకులు చెప్పరా..తెలియదా ఈ విషయం.
నీతి అయోగ్ సుచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. డబుల్ డెక్కర్ ఉన్న యూపీ లాస్ట్.
నిజాలపై చర్చకు సిద్దంగా ఉన్నారా..

5, మన ఊరు మన బడి పైసలు మాయే అన్నరు. 7300 ఖర్చు చేస్తున్నాం. సర్వ శిక్ష అభియాన్ లో వచ్చేది 300 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్లు సమకుర్చితున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నది. అది తెల్సా మీకు. మొత్తం మేమే ఇస్తున్నాం అంటున్నారు.

6, ఇద్దరు కేంద్ర మంత్రులు వేర్వేరు మాటలు
కిషన్ రెడ్డి నారెగా 30 వేల కోట్లు ఇచ్చాము అంటారు. అమిత్ షా 18 వేల కోట్లు అంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట. జుటా మాటలు తప్ప ఏం లేదు.

నట్ట నడి రోడ్డు మీద అబద్ధాలు మాట్లాడారు.

అమిత్ షా తెలంగాణలో ఓట్లు కావాలని అబద్ధాల పురాణాలు చదివారు.

రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై అబద్ధాలు.రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులు అవి.

నీళ్ళు, నిధులు, నియామకాలు…
మాట్లాడే నైతికత లేదు. ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. అప్పర్ భద్ర, పెన్ భ్త్వ, పోలవరం జాతీయ్ హోదా ఇచ్చారు.

కృష్ణ జలాల్లో మా వాటల్ తేల్చాలి అంటే ట్రిబ్యునల్ కు రిఫర్ చేయరు.

 

ఇన్ని వడ్లు.. అన్ని వడ్లు అంటారు. కేసీఅర్ గారి వల్ల ఇప్పుడు 2.59 లక్షల మెట్రిక్ టన్నులు పందుతున్నది. తెలంగాణ ఏర్పాటు సమయంలో 99 లక్షల మెట్రిక్ టన్నులు పండేది.

నీళ్ళు, నిధులు, నియామకాల గురించి మాట్లాడటం పెద్ద జోక్.
మరీ ఇంత పెద్ద కామెడీ.

నీళ్ళు ఇచ్చిమం ఎక్కడికో పోదాం
యాడికి వస్తావు.. చూపిస్తా
పండిన పంటే సాక్ష్యం.
దేశంలో అతి ఎక్కువ వరి పండించిన రాష్ట్రం తెలంగాణ. ఇదే సాక్ష్యం. ఇది మీకు కనిపించడం లేదా.

నిధులు…..
ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధుల గురించి ముందు మాట్లాడు. 7183 కోట్లు ఈ రాష్ట్రానికి రావాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు
బీజీపీ పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నరు. ఏమైందీ చెప్పండి
15. 62 లక్షల ఉద్యోగాలు నిపకుండా ఆపారు. రైల్వే లైన్లు అమ్ముతున్నారు

నిరుద్యోగం మీద బీజేపీ నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నరు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మేము ఇప్పటి వరకు లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసాము. ఇప్పుడు మరో 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మరి మీ సంగతి ఏమిటి..
బిజెపి అధికారంలోకి రాకముందు నిరుద్యోగ రేటు 4.7 శాతం ఉంటే, ఇప్పుడు 7.11 శాతానికి పెరిగింది.
దేశంలో 15 లక్షల 62 వేలు 962 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆర్మీలో 2 లక్షలు, రైల్వైలో 3 లక్షలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేల పోస్టులు ఇలా అనేక విభాగాల్లో సుమారు 25శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఈ లెక్క‌న ఇప్ప‌టి వ‌ర‌కు 15 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయండి.

రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం లేకుండా నింపుతం, జాబ్ క్యాలెండర్ ఇస్తం అన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు కనపడడం లేదా. మేము ఖాళీలు నింపుతున్నం.

95 శాతం స్థానికులకు దక్కేలా సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పుడు నింపుతవు చెప్పు. 15.60 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతవో ముందుం చెప్పు.

అమిత్ అంటే మిత్. అమిత్ షా కాదు ఆయన మిత్ షా.

కాంగ్రెస్ నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదు. జై భారత్ అని అందరం అంటాము. జై తెలంగాణ అనదానికి నోరు రాలేదు.

తెలంగాణ మూడు కోట్ల ప్రజల త్యాగాల
అమరుల ఫలితం.
కాంగ్రెస్ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారు.

బయ్యారం రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివ్సిటీ ఏమైందీ.

కేంద్ర హోం మంత్రిగా విభజన గురించి ఎందుకు అమలు చేయడం లేదు. ఎందుకు మాట్లాడరు.

తెలంగాణలో ఫసల్ బీమా యోజన లేదు అంటున్నారు.
గుజరాత్ లోనే అమలు చేయడం లేదు. కర్పొట్ కొమ్ముకాసే యోజన అని మీ గుజరాత్ అమలు చేయడం లేదు. మమ్మల్ని అనే ముందు మీది చూస్కో.

గుజరాత్ లో ఎందుకు చేయడం లేదు

రైతు వేదికలపై తప్పుుడు ప్రచారం చేస్తున్నారు.
మొత్తం అబద్దం..
జోర్ సే బోల్ అని పదహారు సార్లు అన్నాడు. మీరు చెబుతుంది అబద్ధాలు అని నిజమైంది. అందుకే స్పందన లేదు.

సీఎం సీటుకి 2500 కోట్లు లంచం ఇస్తేనే అవుతాడని కర్ణాటక ఎమ్మెలే అంటడు. మీకు నైతికత ఉందా.లెక్కలతో సహా ఆధారాలతో సహా బట్టబయలు చేశాం.అబద్ధాల బీజీపీ..తుక్కుగుడా సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారు.

Tags: #AmitShah#BJP#harishrao#tanneruharishrao#telanganapolotics#TRS
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info