THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఆధునికత అవధులు దాటింది.. చివరకు?

thesakshiadmin by thesakshiadmin
May 13, 2022
in Latest, Crime
0
విశాఖలో మత్తు ఇంజెక్షన్ల కలకళం..!!
0
SHARES
35
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   బంధాలు.. అనుబంధాల మీద కొత్త తరహా సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితులు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. క్షణిక ఆనందాల కోసం.. ఫాంటసీలను ఎంజాయ్ చేయాలన్న పిచ్చ.. చక్కటి సంసారాన్ని చేతులారా నాశనం చేసుకోవటమే కాదు.. దర్జాగా బతకాల్సిన స్థానం దగాకోరన్న ముద్ర వేయించుకొని జైల్లో ఊచలు లెక్కించాల్సిన దుస్థితి. హైదరాబాద్ లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి వింటనే షాక్ తింటారు.

బాలీవుడ్ క్రైం థ్రిల్లర్ స్టోరీలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్లాన్ చేసిన ఈ వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఈ నెల 4న మీర్ పేటలోని నంది హిల్స్ లో అర్థరాత్రి వేళ చౌరస్తాలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడటం.. ఆ తర్వాత మరణించటం తెలిసిందే. రోడ్డు ప్రమాదంగా భావించినా.. అతగాడి సెల్ ఫోన్ పోలీసులకు దొరకటంతో కథ మొత్తం బయటకు వచ్చింది.అసలేం జరిగిందంటే..

ఐటీ జాబ్ చేస్తున్న విక్రమ్ రెడ్డి.. శ్వేతారెడ్డి దంపతులు. వారిది షాద్ నగర్ సమీపంలోని కేశంపేట్. వీరు మీర్ పేట్ లోని ప్రశాంతిహిల్స్ లో నివసిస్తున్నారు. 2018లో ఆమెకు ఫేస్ బుక్ లో యశ్మకుమార్ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్వేతాకు ఫేస్ బుక్ ద్వారా ఏపీకి చెందిన 28 ఏళ్ల అశోక్ పరిచయమయ్యాడు. అతడితోనే ప్రేమాయాణం సాగించేది. అంటే.. ఇంట్లో భర్త.. ఫేస్ బుక్ లో ఇద్దరు ప్రియుళ్లు. ఇతడు ఒక ప్రైవేటు కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా పని చేసి నాలుగు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు.

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న శ్వేతతో గతంలో యశ్మ కుమార్ న్యూడ్ కాల్స్ చేయించుకునేవాడు. ఆ సందర్భంగా ఆమె వీకాల్స్ ను రికార్డు చేశాడు. ఇటీవల ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు. ఆమె ఒప్పుకోకుంటే ఆ వీడియోల్ని కుటుంబ సభ్యులకు చూపిస్తానంటూ బ్లాక్ మొయిల్ చేస్తున్నాడు. దీంతో.. ఆమె దారుణమైన ప్లాన్ చేసింది. తన రెండో ప్రియుడు అశోక్ కు చెప్పాల్సింది చెప్పి.. తనను వేధింపులకు గురి చేస్తున్న యశ్మ కుమార్ ను హత్య చేయాలని కోరింది.

అందుకు ఓకే చెప్పిన అశోక్.. తన ఊరికి చెందిన కార్తీక్ ను హైదరాబాద్ కు రప్పించి తాము వేసుకున్న పథకంలో భాగంగా మర్డర్ ప్లాన్ చేశారు. ఈ నెల 4న రాత్రి యశ్మ కుమార్ కు శ్వేత ఫోన్ చేసి నందిహిల్స్ కు రావాలని చెప్పింది. బైక్ మీద అక్కడకు వెళ్లిన అతడు శ్వేత కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న అశోక్.. కార్తీక్ లు వెనుక నుంచి వెళ్లి అతని తల మీద మూడుసార్లు గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాలైన అతడు కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడి జేబులో ఉన్న సెల్ ఫోన్ పక్కకు పడిపోయింది.

దాని కోసం కాసేపు వెతికినా దొరకలేదు. అదే సమయంలో అటువైపు వాహనాలు వస్తున్న వైనంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. తొలుత దీన్నిరోడ్డు ప్రమాదంగా భావించారు. కొన ఊపిరితో ఉన్న అతడ్ని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించటం.. చికిత్స పొందుతూ ఆరో తేదీన చనిపోయాడు. ఘటనాస్థలంలో మొబైల్ గుర్తించిన స్థానికులు పోలీసులకు అందజేశారు. ఫోన్ ఓపెన్ చేయటంతో..గుట్టు మొత్తంబయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్వేతారెడ్డిని.. అశోక్ ను అతడి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చక్కగా సాగిపోయే సంసారాన్ని నాశనం చేసుకోవటం అంటే ఇదే?

Tags: #crimenews#EXTERNAL AFFAIRS#HYDERABAD#TELANGANA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info