thesakshi.com : ఎన్టీఆర్ ఫ్యామిలీకి అంత సీన్ వుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ మనుమరాలు, హరికృష్ణ కూతురు సుహాసిని తెలుగుదేశం టికెట్ మీద కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఎందుకు గెలిపించలేకపోయారు?
నందమూరి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తే ఎందుకు గెలిపించుకోలేక పోయారు..
నందమూరి కుటుంభం స్వంత నియోజకవర్గం గుడివాడ అసెంబ్లీ స్థానంలో నాతో పోటీ చేసి గెలవమని కొడాలి నాని నందమూరి బాలకృష్ణ కు బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. అంత ధమ్ము వుంటే ఆ ఛాలెంజ్ ను ఎందుకు స్వీకరించలేదు..
వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల మీద సోషల్మీడియా ద్వారా నందమూరి బాలకృష్ణ కు చెందిన ఇంటి నుంచే అవాకులు చవాకులు పేలినట్టు ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు ఆమె, ఆమె కుటుంభం ఎంత క్షోభ పడ్డారో మీకు తెలియదా..
ఆడవాళ్లు కనిపిస్తే కడుపైనా చేయాలి లేదంటే ముద్దైనా పెట్టాలి అని ఆడపడుచులనుద్దేశించి నందమూరి బాలకృష్ణ నీచంగా మాట్లాడినప్పుడు మీ కుటుంబం ఎక్కడ వుంది..
వైఎస్ జగన్ చాలాసార్లు అసెంబ్లీలో,బయట నారా చంద్రబాబు నాయుడుఎన్ని అవమానాలు చేయించారు. ఎన్ని జరిగినా జనం కోసం చిరునవ్వుతో భరించారే తప్ప ఏనాడూ ఇలా బజారు కెక్కి చంద్రబాబులా దొంగ ఏడ్పులు ఏడ్చింది లేదు… చంద్రబాబు అనుభవం మంత లేదు జగన్ వయస్సు..
అయినా ఆడపడుచులను ఎవరు అవమానించినా తప్పే… కానీ అసెంబ్లీ రికార్డుల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడినట్టు గాని, ఆమె పేరు ప్రస్తావించినట్టు గాని లేదు.
చంద్రబాబు అసెంబ్లీ లో ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చి మొసలి కన్నీళ్లు పెట్టడం భజనమీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం. సీసీ కెమెరాలలో రికార్డు ఎంత పవర్ఫుల్ గా వుంటుందో అలాగే అసెంబ్లీ రికార్డులు కూడా వుంటాయి. పరిశీలించమని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఒకవేళ రికార్డుల నుంచి తొలగించినా ఆ విషయం కనిపెట్టవచ్చు.
రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రాలకు తెరలేపిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియక కాదు. కుప్పంలో ఘోరంగా ఓడపోయాడు. తన ఓటమి గురించి జనం చర్చను దారి మల్లించడం, సానుభూతిని పొందడంలో భాగమే ఈ కుతంత్రం. ఎన్టీఆర్ చంద్రబాబు నీచ సంస్కృతి గురించి ఆనాడే చక్కగా వివరించారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్న నందమూరి వారసత్వం ఇప్పటికైనా చంద్రబాబు కుయుక్తులు గమనించాలి. తన వారసుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి ని చేయడానికి చేస్తున్న కుట్ర కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
చివరకు తన భార్యను కూడా తన నీచ రాజకీయాల కోసం వాడుకొన్న విషయం గమనిస్తే భవిష్యత్తులో తన కుట్రలకు ఏ విధంగా పదును పెడతారనే విషయాన్ని వైఎస్ జగన్ గమనిస్తూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది.