thesakshi.com : నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నందమూరి కుటుంబానికి ఇది విషాద దినం. స్వర్గీయ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆత్మహత్య వార్తను ధృవీకరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆమె ఆకస్మిక మృతితో నందమూరి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కంటమనేని ఉమామహేశ్వరి మృతితో హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులంతా ఆమె నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ నలుగురు కూతుళ్లలో ఉమామహేశ్వరి చిన్న కూతురు. ఉమామహేశ్వరి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది.
ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. వీళ్ళలో కొందరు మనకు తెలుసు హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం సైతం అందరికి తెలిసిందే. ఇక కూతుళ్లు, భువనేశ్వరి, పురంధేశ్వరి గురించి కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ మరో కూతురు మరొక కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ.
అయితే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్నా.. చిన్నకూతురు ఉమామహేశ్వరి జీవితం మాత్రం చాలా విషాదంగా నిండింది. ఉమామహేశ్వరిని నరేంద్ర రాజన్ అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసాడు ఎన్టీఆర్. అయితే అయన చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేసేవాడని, సిగరేట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ళ నాన్న అయినా ఎన్టీఆర్ కి చెప్పింది. దీంతో అతడితో విడాకులు ఇప్పించి ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు ఎన్టీఆర్.