thesakshi.com : టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కే. తారకరామారావు సమావేశం.
పార్టీ జనరల్ సెక్రటరీలతో మంత్రి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఈరోజు సమావేశం అయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు హాజరు.
పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి మార్గనిర్దేశనం మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన కేటీఆర్
జనరల్ సెక్రటరీలు ఇన్చార్జిలుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణం పైన సమీక్ష
ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా పూర్తయిన గ్రామ కమిటిల నిర్మాణ వివరాలు అందజేసిన జనరల్ సెక్రటరీలు
గత రెండు రోజులుగా మిగిలిన 20 శాతం కమిటీలకు సంబంధించి కూడా నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి…
ఈనెల 15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీ లకు సూచించిన కేటీఆర్
ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తి కావాలి
మండల కమిటీల నిర్మాణము /కూర్పు కు సంబంధించి పలు సలహాలు సూచనలను ఇచ్చిన కేటీఆర్
మండల కమిటీ ల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను గౌరవ ముఖ్యమంత్రి ప్రకటిస్తారు
జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటు పైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామన్న కేటీఆర్
పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతితో పాటు పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను తెలుసుకున్న కేటీఆర్
పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ పార్టీ నాయకులు సైతం ఈ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపిన జనరల్ సెక్రటరీ లు
సంస్థాగత కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందని తెలిపిన సెక్రటరీలు
ఇప్పటికే పార్టీ నిర్ణయించిన 51 శాతం కనీస పరిమితిని మించి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు కమిటీలో చోటు దక్కిందని తెలిపిన సెక్రటరీలు…
పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణ గణాంకాలు అందజేయాలని కేటీఆర్ సూచన
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న మహిళా కార్యకర్తలకు పార్టీ కమిటీల కూర్పులో ప్రాధాన్యత ఇవ్వాలని ఈ విషయంలో ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపించాలని కేటీఆర్ సూచన
పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి సమీక్షిస్తామన్న కేటీఆర్