thesakshi.com : కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వదులుకోలేక.. తమపిల్లలను ఎలాగైన తిరిగి తెచ్చుకొనేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు పిళ్లైన తర్వాత.. కూడా వారిపై పోలీసు కేసులు పెట్టి, తమ మార్గంలో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. త్రిపుర రాష్ట్రంలో ఇద్దరు ప్రేమికుల కొత్ జీవితం పెళ్లైన కొద్దిరోజులకే విషాదంగా ముగిసింది. త్రిపురలోని గోమతి జిల్లాలోని ఆనంద్ చక్మా అనే యువకుడు, ధలై జిల్లాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. కానీ యువతి మైనర్. వీరిద్దరు తమ ఇంట్లో వారికి తెలియకుండా తరచుగా కలుసు కునేవారు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఇంట్లో వారికి తమ ప్రేమ వ్యవహారం చెప్పారు. కానీ వారు అంగీకరించలేదు. ఆ తర్వాత.. ఒక రోజు వీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకు వీరి వ్యవహారం ఇంట్లో తెలిసింది.
పాపం.. తమ కూతురు కనిపించడం లేదని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. వారు గోమతి జిల్లా దగ్గరలో కప్తా అనే గ్రామంలో కాపురం పెట్టారు. అయితే , పోలీసులు (Summoned By Cops) వీరికి ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ కు రావాలని సూచించారు. దీంతో భయపడిపోయిన వారు.. తమను ఎక్కడ విడదీస్తారోనని ఒత్తిడికి గురయ్యారు. ఒకరిని వదిలి మరోకరు ఉండలేక.. పోలీసులకు భయపడి చావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత సేపటికి వీరు బయటకు రాకపోవడంతో ఇరుగు పోరుగు వారు ఇంటికి వెళ్లి చూశారు. అప్పుడు వీరిద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అప్పటికే చనిపోయారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.