thesakshi.com : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది.
ఆస్తి కోసం.. డబ్బుల కోసం అమ్మాయిలను ఏమార్చి వరుస పెళ్లిళ్లు చేసుకునే మగ పుంగవులకు కొదవ లేదు. కానీ ఇలా అమ్మాయి చేస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 పెళ్లిళ్లు చేసుకొని ఎంజాయ్ చేసింది. కానీ 9వ భర్తకు అడ్డంగా దొరికింది ఈ కి’లేడీ’. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ పెళ్లి సంబంధాలకు సంబంధించిన మ్యాట్రిమోనీ సైట్లో ఆంధ్రా అబ్బాయికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారితీసింది.
ఆ అమ్మాయి తన పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాదిని వెంటపెట్టుకొని ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. మంచిగా మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకుంది. 2018లో వీరికి పెళ్లి జరిగింది.
ఈ నవ దంపతులు రెండు నెలలు మాత్రమే కాపురం చేశారు. ఈ రెండు నెలల కాలంలో ఆ అమ్మాయి తరచూ ఫోన్లో మాట్లాడుతూ కోర్టు విషయాల్లో తలమునకలై ఉండేదని.. ఏంటని ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేదని భర్త వాపోయాడు.
అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై నిలదీయండంతో భర్తపైనే గొడవకు దిగింది. దీంతో తనకు విడాకులు కావాలంటూ భర్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. విషయం తెలుసుకున్న కిలాడి లేడీ తనను భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి హల్ చల్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుగు మాట్రిమోనీ లో పరిచయమై 2019 ఏప్రిల్ 10న కర్నాటి స్వప్న, వెంకటేష్ లు వివాహం చేసుకున్నారు. స్వప్న స్వస్థలం మహబూబాబాద్. అయితే ఆమె హైదరాబాదులో నివాసం ఉంటుంది. వెంకటేష్ ది కృష్ణా జిల్లా గంపలగూడెం. పెళ్లి అయ్యాక జాబ్ కోసం ఇద్దరు బెంగుళూరుకు వెళ్లారు. పెళ్లయిన రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది.
ఇలా నడుస్తున్న క్రమంలో ఓ రోజు బెంగళూరు నుంచి అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లాలని పట్టుబట్టిందని.. వెళ్లి వచ్చాక మళ్లీ వెళ్లాలని అనడంతో అనుమానం వచ్చి ఫాలో అవ్వగా ఆమె చేసిన తతంగం అంతా బయటపడిందన్నారు.
ఆమె వివరాలు తెలుసుకోగా షాక్ అయ్యానని.. ఆమె చేసుకున్న పెళ్లి తతంగాలు అన్నీ ఇన్నీ కావని తెలుసుకొని మోసపోయానని సదురు 9వ భర్త వాపోయాడు. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న ఆమె 9వ పెళ్లిని తనను చేసుకుందని తెలుసుకున్న భర్త తననుంచి విడాకులు కావాలని కోరింది. దీంతో ఆ ఖిలాడీ ప్లాన్ చేసింది. ఆ భర్త నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో బైఠాయించింది. దీంతో నివ్వెరపోయిన పోలీసులు భర్తను పిలిపించారు. భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు.
ఇలా వలుపు పరిచి దొరికినంత దోచుకోవడంలో ఆ కిలాడీ లేడీ స్టైల్ వేరు అని తేలింది. చివరకు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ గడపలో ఆ భర్తకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. ఈ విషయం ఎస్పీ దృష్టికి పోలీసులు తీసుకెళ్లగా.. టౌన్ పోలీసులు ఆ లేడికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.