THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఎన్ని కష్టాలొచ్చినా..!

thesakshiadmin by thesakshiadmin
April 4, 2022
in Latest, Politics, Slider
0
యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తాం:చంద్రబాబు
0
SHARES
236
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :    వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆవిర్భావం దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 83 ఫార్ములాను తెరపైకి తెచ్చారు.

తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఉందన్నారు. రాజకీయాల్లో గాడ్‌ ఫాదర్‌ లేడని భయపడొద్దని.. సమాజహితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రావాలని.. ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఒక్క చంద్రబాబు. ఏం చేయగలడు అని నాడు అంటే ఇప్పటికి ఇరవై ఏడేళ్ల క్రితం తెలుగుదేశం అధినేత ఎన్టీయార్ అనుకున్నారు. అందుకే ఆయనతో పాటు మరి కొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అది జరిగిన సరిగ్గా వారం తరువాత ఎన్టీయార్ గద్దె దిగారు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇదంతా 1995 నాటి రాజకీయ ముచ్చట.

చంద్రబాబుకు అంత నైతిక రాజకీయ బలం రావడం వెనక నందమూరి ఫ్యామిలీ మొత్తం వెంట ఉంది. ఉప్పూ నిప్పులా ఉండే అల్లుళ్ళు ఇద్దరూ కలిశారు. కుమారులూ కుమార్తెలు కూడా ఆ వైపునకు వచ్చారు. దాంతో ఎన్టీయార్ ఒంటరి అయ్యారు. పొలిటికల్ గేమ్ మారింది అంతే. మళ్లీ ఇన్నేళ్ళ తరువాత అంటే 2024 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్ అంటోంది నందమూరి ఫ్యామిలీ.

కాకపోతే మరెపుడు అన్నదే నందమూరి ఫ్యామిలీ స్లోగన్. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా గెలిచి తీరాలి. పొరపాటున ఓడిందో ఇక పార్టీ ఉనికి కష్టం. ఆ విధంగా అన్న గారు పెట్టిన పార్టీ చరిత్ర పుటలలోకి వెళ్లిపోతుంది. అంటే ఇది అతి పెద్ద సెంటిమెంట్. ఎన్టీయార్ ని ఆరాధించే వారు సైతం తట్టుకోలేని వార్త.

మరి వారికే అలా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబా మరొకరా అని కానే కాదు ఎన్టీయార్ పెట్టిన పార్టీ వర్ధిలాలి. మరో నలభై ఏళ్లు అలా సాఫీగా సాగిపోవాలి. ఇదే ఇపుడు నందమూరి బ్లడ్ లో ప్రవహిస్తున్న మంత్రం. ఇదే వారి నోటి వెంట వినవస్తున్న మాట కూడా.

వచ్చే ఎన్నికల్లో ఒక వైపు పొత్తులను సెట్ చేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా కొత్త వ్యూహాలను రచిస్తున్న చంద్రబాబు ఇపుడు ఇంట కూడా గెలిచేందుకు చూస్తున్నారు. పాతికేళ్ళుగా తలో వైపుగా ఉన్న అన్న గారి కుటుంబం చంద్రబాబు పుణ్యమాని మరో మారు కలిసే వీలుంది అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాడో పేడో అన్నట్లుగా పోరాటం జరగనుంది కాబట్టి అన్న గారి వారసులు అంతా ఒక్కటి కావాలి. ఇదే అందరిలోనూ ఆలోచనగా ఉంది. మొత్తానికి ఎన్టీయార్ పెట్టిన పార్టీని కాపాడుకోవడానికి తలో చేయి వేస్తారని తెలుస్తోంది. ఎన్టీయార్ కుమారులలో బాలయ్య ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.

మిగిలిన వారు కూడా సరైన సమయంలో బయటకు వస్తారు అంటున్నారు. కుమార్తెలలో భువనేశ్వరి ఈసారి కీలక పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. పొత్తు ఉంటే ఆమె కచ్చితంగా ఈ వైపు ఉన్నట్లే. లేకపోయినా ఆమె వంతు సపోర్టు ఉంటుంది అంటున్నారు. ఇక పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరవారు కూడా టీడీపీకి మద్దతుగా ముందుకు వస్తారు అని తెలుస్తోంది.

అలాగే మనవళ్లలో హరిక్రిష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ జై టీడీపీ అంటున్నారు. జయక్రిష్ణ కుమారుడు చైతన్య క్రిష్ణ. మోహనక్రిష్ణ కుమారుడు తారక రత్న వంటి వారు ప్రచార పర్వంలోకి దూకుతారు అని చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీయార్ కూడా ఈ వైపునకు వచ్చేలా ఒక బలమైన సామాజికవర్గం నుంచి పావులు కదుపుతున్నారని అంటున్నారు.

మొత్తానికి టీడీపీని ఈసారి గెలిపించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు అనే చెప్పాలి. అంటే టోటల్ ఎన్టీయార్ ఫ్యామిలీ బాబు వెంట ఉండి జయీభవ అని దీవిస్తుంది అన్న మాట. మరి ఈసారి కచ్చితంగా టీడీపీ గెలవాలి. అన్నీ అనుకూలంగా ఉన్నపుడు సైతం గెలవకపోతే ఎలా. సో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Tags: #Andhrapradesh#andhrapradeshpolitics#appolitics#ChandrababuNaidu#lokeshnara#NaraChandrababuNaidu#TDP#TeluguDesamParty#telugudesampolitics
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info