thesakshi.com : సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై నీటిపారుదలశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
పోలవరం పనులపై ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు..వర్షాలు వచ్చేలోగా పూర్తిచేయాల్సిన పనులపై సీఎం సమీక్ష
కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్ డ్యాం పనులు తదితర కీలక పనులపై సీఎం సమీక్ష
మే నెల కల్లా కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తిచేస్తామన్న అధికారులు
అప్రోచ్ ఛానల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇవి కూడా మే నాటికి పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు
కాఫర్ డ్యాంలో ఖాళీలను పూర్తిచేయడం, అప్రోచ్ ఛానల్‌ను పూర్తిచేయడం అన్నది అత్యంత ఆవశ్యకమన్న సీఎం
వెంటనే వీటిపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
స్పిల్ ఛానల్‌లో మట్టి మరియు కాంక్రీట్ పనుల తవ్వకం పనులను మరింత వేగవంతం చేయాలి సీఎం.రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలని సీఎం ఆదేశం
పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష..
ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నామన్న సీఎం
కష్టకాలం అయినప్పటికీ .. పోలవరం సహా ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతోనిధుల విడుదలతో పాటు అన్నిరకాలుగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పిన సీఎం
ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా ప్రభుత్వం నిర్దేశించుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకులో టన్నెల్ –2, వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ –1, వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ –2, టన్నెల్ –2 సహా సహా వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులు, వంశధార నాగావళి లింక్, వంశధార ఫేజ్-2, స్టేజ్ –2 పనులపైనా సీఎం సమీక్ష
నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని సీఎంకు వివరించిన అధికారులు
అవుకులో రెండో టన్నెల్‌లో కెమికల్ పోరింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించిన అధికారులు
ఆగస్టు నాటికి మొత్తంగా 20వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేలా సొరంగాలు సిద్ధమవుతాయని వెల్లడించిన అధికారులు
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ –1 ఇప్పటికే పూర్తైందని, డిసెంబర్ నాటికి రెండో టన్నెల్ పూర్తి అవుతుందన్న అధికారులు
వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబరు నాటికి నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపైనా సమీక్ష
వంశధార నాగావళి, వంశధారలో ఫేజ్-2, స్టేజ్ –2 పనులు జులై నాటికి పూర్తిచేస్తామన్నఅధికారులు
నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం
ప్రాధాన్యతా ప్రాజెక్టులపైన అధిక దృష్టిపెట్టి ముందుకెళ్తున్నామన్న సీఎం
ఎక్కడా కూడా అవాంతరాలు అనేవి రాకుండా తదేక దృష్టితో ముందుకు సాగుతున్నామన్న సీఎం
గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోలిస్తే.. ఈ 18 నెలల కాలంలో పనులు చాలా వేగంగా ముందుకు వెళ్లాయన్న సీఎం
ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తైన తర్వాత మిగిలిన వాటిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్–2, తారకరామ సాగర్ తదితర మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం
రాయలసీమ, పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులపై సమీక్ష
రాయలసీమ కరువు నివారణ కింద చేపట్టనున్న ప్రాజెక్టులు, అలాగే పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ కోసం చేపట్టనున్న ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష
ఒక ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాజెక్టులు ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించాలన్న సీఎం
ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.