ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పిసి
ఈ సారి మార్చ్ నెల నుంచి ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ పిసి తెలిపారు.
2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది…
ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ కి చేరుకుంటుంది
ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది
ఎపి జెన్ కో ద్వారా 85 మిలియన్ యూనిట్లు, ,సెంట్రల్ స్టేషన్స్ ద్వారా 45…విండ్ పది, సోలార్…మొత్తంగా 175 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది
జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతుంది
జెన్ కో సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
డిమాండ్ కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది
ఎపిలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి
మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం…..ఇందుకోసం దాదాపు 1250 కోట్లని ఖర్చు చేశాం
బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది
విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు
తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాయి
వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి
నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం
వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది
తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం…అక్కడా ఇదే పరిస్ధితి
2014-15 లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది.