thesakshi.com : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పోలేరమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు చేసిన ఘటన చోటుచేసుకుంది. పేరుకేమో పోలేరమ్మ జాతర నిర్వహించిన కొందరు వ్యక్తులు దైవ కార్యం పేరుతో పాప కార్యాలకు తలపెట్టారు. పోలేరమ్మ జాతర పేరుతో తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్ళరేవు మండలం కుప్పం గ్రామంలో న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వహించారు.
పోలేరమ్మ జాతర సందర్భంగా కుప్పం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ అశ్లీల నృత్యాల కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు నగ్న నృత్యాలు చేయించారు. ఇక ఈ విషయం గ్రామంలో ఉన్న వారికి తెలియడంతో దాంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తర్వాత హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అశ్లీల నృత్యాల ఈవెంట్ నిర్వహించిన వారితో సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు చేయించడం పై విమర్శల వెల్లువగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి పోలీసుల కన్నుగప్పి అశ్లీల నృత్యాలు చేయించారని స్థానికులు చెబుతున్నారు. తాళ్ళరేవు మండలం కుప్పం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన పై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత భక్తితో చేసుకోవలసిన అమ్మవారి జాతరను అశ్లీల నృత్యాలతో అపవిత్రం చేశారని మండిపడుతున్నారు. అయితే స్థానిక నేతలు కూడా ఈ అశ్లీల నృత్యాలను చేయించిన వారిలో ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.