thesakshi.com : వారిది రెండున్నర దశాబ్దాల వివాహబంధం. అప్పటి నుంచి కూలిపనులు చేస్తూనే ఉన్నంతలో భార్యను బాగానే చూసుకుంటున్నాడు. ఆమె వ్యాపారం చేస్తానంటే అప్పులు తెచ్చి మరీ లక్షలు చేతిలో పెట్టాడు. కానీ ఆమె మాత్రం భర్త ప్రేమను అపహస్యం చేసింది. అన్నేళ్ల సంసార జీవితాన్ని అవహేళన చేస్తే పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తప్పని చెప్పిన భర్తను.. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్ కు చెందిన పల్లపు గంగాధర్-లక్ష్మీ దేవి పంపతులకు 24 సంవత్సరాల క్రితం పెళ్లైంది. అప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే లక్ష్మీదేవి చీరల వ్యాపారం చేస్తానంటే 8లక్షల రూపాయలు అప్పు తెచ్చి భార్య చేతిలో పెట్టాడు.
భర్త అంతగా సహకరిస్తున్నా లక్ష్మీదేవి మాత్రం వక్రమార్గం లో వెళ్లింది. స్థానిక తారకరామాపురంకు చెందిన నారా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తితే వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న గంగాధర్.. ఆమెను పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. భార్య ఎంత చెప్పినా వినకుండా ప్రియుడితో తిరగడాన్ని జీర్ణించుకోలేని గంగాధర్ మద్యానికి బానిసయ్యాడు. మరోవైపు తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మీదేవి.. అతడ్ని అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది.
విషయాన్ని అన్న వెంకటేష్, అల్లుడు సుధాకర్ చెప్పింది. వారికి డబ్బు ఆశ చూపి హత్యకు ఉసిగొల్పింది. ఈ క్రమంలో గత నెల 8వ తేదీన అర్ధరాత్రి స్థానిక ఎల్పీ సర్కిల్ లోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్ పై బండరాయిని వేశారు. ఇరుపరాడ్డుతో గొంతుపై అదిమి హత్య చేశారు. ఆ తర్వాతి రోజు భర్తను అప్పులిచ్చిన వారు హత్య చేశారంటూ గోల చేసింది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఐతే లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవితో పాటు మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. తమ కోసం పోలీసులు గాలిస్తున్న విషయాన్ని తెలుసుకొని వీఆర్వో ద్వారా లొంగిపోయారు. అనంతరం హత్య ఎందుకు చేసింది, ఎలా చేసిందే అనే విషయాలను పోలీసులకు వివరించారు.