thesakshi.com : ఒలెక్ట్రా నుంచి పూణే నగరానికి మరో 150 ఎలక్ట్రిక్ బస్ లు
• భారతదేశంలోనే అత్యధికంగా విద్యుత్ బస్సులను అందిస్తున్న ఏకైక సంస్థ ఒలెక్ట్రా
• విద్యుత్ బస్సుల తయారీలో దేశంలోనే అగ్రగామి
• పూణేలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న 150 ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు
* 150 ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను వర్చువల‌్ గా జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశంలో మరే నగరంలో లేని విధంగా 300 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న ఖ్యాతిని పొందిన ఒలెక్ట్రా
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి ప్రజలకు అంకితం చేశారు. 150 ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఆయన పుణే లో వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పోత్రహించాలని, తద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చునని మోది ఈ సందర్భంగా అన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన 150 ఎలక్ట్రిక్ బస్సులతో, పూణే నగరంలో ఒలెక్ట్రా విద్యుత్ బస్సుల సంఖ్య 300కి పెరిగింది. పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెట‌్ (పీఎంపీఎల్) కోసం ఈ బస్సులను ఒలెక్ట్రా నడుపుతున్నది. దేశంలో మరే నగరంలో లేన్ని ఎలక్ట్రిక్ బస్సులు పూణేలోనే నడుస్తుండడం విశేషం. దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, నిర్వహణలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థ అగ్రగామిగా ఉంది. ఇప్పటికే పూణేలో ఒలెక్ట్రా 150 బస్సులను నడుపుతోంది. దేశంలోని ప్రముఖ నగరాలైన సూరత్, ముంబై, పూణే, సిల్వాసా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో కూడా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహిస్తోంది.
ఒలెక్ట్రా తయారు చేస్తున ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునికమైనవి. ఒలెక్ట్రా బస్సుల పనితీరుపై అన్ని వైపుల నుండి ప్రశంసలు అందడంతో ఇతర రాష్ట్రాల రవాణా సంస్థలు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆసక్తి చూపుతున్నాయి.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. ప్రదీప్ మాట్లాడుతు “ఒలేక్ట్రా పూణే నగరంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న 150 బస్సులకు ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా అదనంగా మరో 150 బస్సులను జోడించడం గర్వకారణంగా ఉంది. పూణే నగర గొప్ప వారసత్వాన్ని ఒలెక్ట్రా బస్సులు కాపాడుతాయి. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ధ్వని కాలుష్యం, కర్బన్ ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి, అలాగే సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణకు ఒలెక్ట్రా సంస్థ కట్టుబడి ఉంటుంది. మా ఎలక్ట్రిక్ బస్సులు పూణే నగరంలో ఇప్పటికే దాదాపు 2 కోట్ల కిలోమీటర్లకు పైగా విజయవంతంగా పనిచేసి తన విశ్వసనీయతను, సామర్థ్యాన్ని నిరూపించాయి” అని అన్నారు.
ఈ 12-మీటర్ల ఎయిర్ కండిషన్డ్ బస్సులు డ్రైవర్‌తో సహా 34 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉంటాయి. బస్సులో అమర్చబడిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒక ఛార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తుంది. ఈబస్సుల బ్రేకింగ్ సిస్టమ్ అధునాతనమైనది. బ్రేక్‌వేసినప్పుడు కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందేందుకు వీలు కల్పిస్తుంది. అధిక-పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ బస్సు బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
MEIL గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ గురించి-
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో ఏర్పాటు చేసిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది MEIL గ్రూప్‌లో భాగం. 2015లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేసింది ఒలెక్ట్రానే. ఇది పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల కోసం సిలికాన్ రబ్బర్/కాంపోజిట్ ఇన్సులేటర్ ఉత్పత్తిలో భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ.