thesakshi.com : హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా భారీ సక్సెస్‌ను మాత్రం అందుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలను అందుకున్నా.. వాటిని భారీ స్థాయిలో మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో అతడికి అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ టాల్ హీరో ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? ట్విట్టర్‌లో నెటిజన్లు ఈ మూవీ గురించి ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను చూద్దాం పదండి!
ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో గోపీచంద్. కెరీర్ స్టార్ట్ అయ్యి మూడు, నాలుగు సినిమాలు మినహా సరైన హిట్ పడలేదు. అయితే ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు గోపిచంద్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీకన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే సత్యరాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. యు వి క్రియేషన్స్, గీత ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రంను బన్నీ వాసు నిర్మించారు.
ఇక కథ విషయానికి వస్తే సినిమాలో గోపీచంద్ ఒక లాయర్ గా నటించాడు. ఆయన పేరు రాంచంద్. ఈయన దృష్టిలో ప్రతిదీ పక్కా కమర్షియల్ గానే ఉంటుంది. ఏ విషయం అయినా డబ్బుతో ముడి పెడుతూ ఉంటాడు. అయితే రాంచంద్ దగ్గర సీరియల్ నటిగా ఉన్న హీరోయిన్ ఝాన్సీ పాత్రలో నటించినటువంటి రాశీకన్నా అసిస్టెంట్ గా చేరుతుంది. తన సీరియల్లో లాయర్ పాత్ర కోసం రాంచంద్ దగ్గర అసిస్టెంట్ గా చేరుతుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ కొన్నాళ్లకు రాంచంద్ కు తన తండ్రితో పోటాపోటీగా వాదించాల్సి వస్తుంది. ఈ కేసు సినిమాను ఒక మలుపు తిప్పుతుంది. ఇంతకీ ఆ కేస్ ఏంటి రాంచంద్ కేసు ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది. ఆఖరికి ఎవరు గెలిచారు అనేదే ఈ సినిమా కథ.
ఇక డైరెక్టర్ మారుతి ఎప్పటినుంచో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మారుతి సినిమాలకు నిజమైన బలం కామెడీ. ఈ సినిమాలో కూడా కామెడీ అద్భుతంగా పేలింది. ఎక్కువ శాతం గోపీచంద్ కు హిట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే మారుతి ఈ సినిమాను తెలకెక్కించినట్లు అర్థం అవుతుంది. మారుతి సినిమాల్లో ఇప్పటివరకు ఎక్కడా చెప్పుకోదగ్గ యాక్షన్ సీన్స్ కనిపించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం కాస్త ఎక్కువగానే యాక్షన్ సీన్స్ పెట్టాడు. అందుకు కారణం గోపీచంద్ అభిమానులను సంతృప్తి పరచడానికే అని అర్థమవుతుంది.
పాత్రల పరిచయం ఓపెనింగ్ అంతా చాలా బాగుంది. కానీ సినిమా నడుస్తున్న కొద్ది సేపటికి ఆడియన్స్ కు బోర్ కొట్టించేలా ఉండడం కాస్త మైనస్ గా చెప్పాలి. ఫస్ట్ పార్ట్ అంతా మారుతి మార్కు కామెడీ, సెకండ్ ఆఫ్ గోపీచంద్ యాక్షన్ తో ఈ చిత్రం కొనసాగుతుంది. సెకండ్ హాఫ్ కోసం ఎదురుచూసే ఆడియన్స్ కు అంత కొత్తదనం ఏం కనిపించదు. అలాగే గోపీచంద్ లో ఈ కసి చూసి చాలా రోజులైంది. లౌక్యం తరహా బాడీ లాంగ్వేజ్ కామెడీ టైమింగ్ అన్ని గుర్తుకు వస్తాయి. ఇక రాశీ కన్నా కూడా పరవాలేదు అనిపించింది. తన పాత్రకు న్యాయం చేసింది. రావు రమేష్ అప్పట్లోనే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. సత్య రాజు, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు..అలాగే మారుతి గురించి చెప్పాలంటే మారుతి అడల్ట్ కామెడీ అనే ముద్ర ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం దానికి యాక్షన్ జోడించాడు.
డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందిన సినిమా పక్కా కమర్షియల్.
యు వి క్రియేషన్స్, జి ఎ టు పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మతగా బాధ్యతలు చేపట్టాడు.
ఇందులో గోపీచంద్, రాశిఖన్నా నటీనటులుగా నటించారు.సత్యరాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు.
కర్మ్ చావ్లా ఛాయా గ్రహణం అందించాడు.జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు.
ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా గోపీచంద్ కు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.
కథ:
ఇందులో రాంచంద్ (గోపిచంద్) అనే పాత్రలో నటించాడు.అంతేకాకుండా లాయర్ పాత్రలో కనిపించాడు.
ఇక ఇతని దృష్టిలో ప్రతీది పక్కా కమర్షియల్ గా ఉంటుంది.ఇక ఇతడు చాలా సంవత్సరాల తర్వాత లాయర్ గా తిరిగి తన ఉద్యోగంలోకి చేరుతాడు.
ఇక ఆ సమయంలోనే తనకు సీరియల్ నటి ఝాన్సీ (రాశిఖన్నా) పరిచయం అవుతుంది.ఆమె తన సీరియల్ కోసం లాయర్ పాత్రలో నటించడానికి అతని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది.
ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో కూడా పడతారు.ఇక రాంచంద్ ఒక కేసు విషయంలో అతని తండ్రితో వాదిస్తాడు.
అసలేం జరిగింది.మరి తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఇందులో గోపీచంద్ తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా తన నటనతో, తన కామెడీతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను తాకాడు.ఇక రాశిఖన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది.
మిగతా నటీనటులు అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మారుతి దర్శకుడిగా తనదైన మార్క్ చూపించాడు.ఇక కామెడీ టైమింగ్ తో సినిమాను బాగా నడిపించాడు.
ప్రేక్షకులను తన కామెడీతో బాగా నవ్వించాడు.ఇక యాక్షన్ అంతగా చూపించలేకపోయాడు డైరెక్టర్.
క్లైమాక్స్ కూడా అద్భుతంగా చూపించాడు.మారుతికి ఈ సినిమా కెరీర్ పరంగా బెస్ట్ సినిమాగా నిలిచింది.
కర్మ్ చావ్లా అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఇక జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఉంది.ఇతర టెక్నీషియల్ విభాగాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ:
సినిమాను అద్భుతమైన కథతో చూపించాడు మారుతి.కామెడీని మాత్రం బాగా అందించాడు.యాక్షన్ పరంగా కాకుండా కామెడీ పరంగా గోపీచంద్ కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
గోపీచంద్ తన పాత్రతో మరో కొత్త లుక్ ను చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అనిపించింది.సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.
బాటమ్ లైన్:
చివరగా కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
రేటింగ్: 3.25/5