thesakshi.com : ఏపీలో ప్రస్తుత విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యకు ప్రధాన కారణం.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయన్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమన్నారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయన్నారు. దీనికి తోడుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందని వివరించారు.
అలాగే విద్యుత్ కొరత ఏర్పడటంతో బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఏర్పడిందన్నారు మంత్రి. విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతుండటంతో విద్యుత్ ధర అమాంతం పెరిగిపోయిందన్నారు. చాలా రాష్ట్రాల బాటలోనే ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని ఆయన స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాలు వేరు మన రాష్ట్రం వేరు. ఇవన్నీ చూస్తే కొరత నివారణ జగన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నదని వాటి ఫలితాలు త్వరలోనే వెల్లడిలోకి వస్తాయని ఓ చిన్న ఆశ కలుగుతోంది.ఆ విధంగా పెద్దిరెడ్డి మరోసారి బొగ్గు కొరత నివారణకు. బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలుకు తామేం చేయనున్నామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది.. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా బొగ్గు దిగుమతులు లేవు. దీని కారణంగానే సమస్యలు వస్తున్నాయి అని చెబుతున్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఒక కోర్ మేనేజ్మెంట్ టీం ను ఏర్పాటు చేశామని అంటున్నారు. మరి! వీటి ఫలితం ఎలా ఉండనుందో ..అన్నది కొద్ది రోజులు ఆగితేనే తేలుతుంది మరియు తెలుస్తుంది.
ఆంధ్రావని వాకిట విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి. బొగ్గు కొరత ప్రభావం సంబంధిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్రంగా ఉంటోంది. కీలక సమయంలో ఎంతో రిస్క్ ఫేస్ చేసి పరిశ్రమలకు పవర్ ఆఫ్ ప్రకటించినా కూడా సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. గ్రామాలలో విద్యుత్ కోతలకు వేళాపాళా లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయని వీరంతా వాపోతున్నారు.
ఈ సమయంలో పంటలపై కోతల ప్రభావం పడకూడదని ప్రభుత్వం భావిస్తోంది.ఎట్టకేలకు అప్రమత్తమైంది. ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు చేసి ఆంధ్రావాసులకు శుభవార్త చెప్పారు. మే మొదటి వారం నుంచి కోతల నివారణ సాధ్యం అవుతుందని కొరత నివారణ కూడా సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.