thesakshi.com : రాజకీయంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్లటానికి పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన తమిళనాడు..పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా మద్దతిచ్చిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి.
ఎవరిని పీకేస్తారో ఎవరిని లాగేస్తారో
ప్రశాంత్ కిషోర్ అంటే
పీకే అన్నమాట . ఇదే ఇపుడు వైసీపీలో అంతర్లీనంగా ఎమ్మెల్యేలు సణుగుడుగా ఉంది. ఇక్కడ పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు సుమా వైసీపీ పెద్దలు మెచ్చిన నచ్చిన ఎన్నికల మాస్టర్ మైండ్ మహా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇక పీకే అంటే వైసీపీ హై కమాండ్ కి గొప్ప గురి. ఆయన చెప్పాలే కానీ ఎంతటి వారి నైనా దించేయడానికి పెద్దలు రెడీ అయిపోతారు. 2019 రిజల్ట్స్ దానికి కారణం. అలాంటి పీకేని మరో మారు వైసీపీ అధినాయకత్వం నమ్ముకుంది.
వైసీపీ లో ప్రజెంట్ పిక్చర్ ఏంటి అన్నది అర్జంటు గా తెలుసుకోవాలనుకుంటోంది. అదే విధంగా ఎమ్మెల్యేల పని తీరు మీద పక్కా నివేదిక కోరుతోంది. ఇక ఎమ్మెల్యేలు ఎవరు చురుకు ఎవరు బ్యాక్ వంటి విషయాల మీద కూడా కూపీలను లాగమంటోంది. ఎమ్మెల్యేల సమర్ధత మీదనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని జగన్ ఈ మధ్య జరిగిన వైసీఎల్పీ మీటింగులో చెప్పాశాక ఇక పీకే మాట శిలాశాసనమే అనుకోవాలి.
ఏపీలో పీకే టీంలు రంగంలోకి దిగిపోతున్నాయి. వారి వద్ద అనేక అంశాలు ఉన్నాయి. వాటిని పట్టుకుని జనాల్లోకి దూసుకుపోతారు. ఎమ్మెల్యేలకు కనుక పీకే టీం సర్వేలో మైనస్ మార్కులు వస్తే కనుక ఇక ఇంతే సంగతులు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి హెచ్చరిక అలా వస్తుంది. ఆ మీదట కూడా జరిగే మరో రెండు సర్వేలలో కూడా పరిస్థితి మెరుగుపడకపోతే ఏకంగా టికెట్టుకే టిక్కు పెట్టేస్తారు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు పీకే ఫీవర్ పట్టుకుంది. ఆ టీం ఎలాటి సర్వే చేస్తుందో ఏ రకమైన నివేదికను ఇస్తుందో అన్న కంగారు అయితే ప్రతీ వారిలో దండీగా ఉంది. దాంతో గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇదిలా ఉంటే పీకే టీం తో పోటీగా మరో రెండు సర్వే సంస్థలతో వైసీపీ ఒప్పదాన్ని కుదుర్చుకుంది.
ఆ సర్వే బృందాలు కూడా సమాంతరంగా జనాల్లోకి వెళ్ళి సర్వే చేస్తాయి. వాటి సర్వే ఫలితాలు పీకే టీం ఫలితాలను కూడా బేరీజు వేసుకుని అధినాయకత్వం ఒక నిర్ణయానికి వస్తుంది అంటున్నారు. ఈ మొత్తం సర్వేలలో పీకే టీం మాటకే విలువ ఎక్కువ అంటున్నారు.
ఇక మూడేళ్ల జగన్ సర్కార్ పనితీరు మీద ఏపీలో లక్షల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అందుకున్న లబ్దిదారుల స్పందన ఏంటి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఉద్యోగులు యువత విద్యార్ధులు మహిళలు తటస్థులలో పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఉన్న కచ్చితమైన అభిప్రాయం ఏంటి అన్నదే ఇపుడు పీకే టీం శోధించే అంశాలు. మొత్తానికి వైసీపీలో ఎమ్మెల్యేలకు మాత్రం పీకే పితలాటకం మామూలుగా లేదు అంటున్నారు.భవిష్యత్ కార్యచరణ పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కోసం రంగంలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, కెసిఆర్ పాలన తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సర్వేలను మొదలు పెట్టారు. ఈ క్రమంలో పీకే టీం చేస్తున్న సర్వేలు టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉండబోతుంది అన్న ఆసక్తికర విషయాలు ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహిస్తున్న సర్వేలో వెలుగులోకి వస్తున్నాయి.