thesakshi.com : ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడంమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ తరుపున లాభాలు పొందిన వ్యక్తి సీపీఐ నారాయణ
నన్ను ఎప్పుడు విమర్శించారు… ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నేను ప్రతి విమర్శ చేయలేకుండా సద్విమర్శగా తీసుకున్న.
చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్త. ఒకే వ్యక్తి ఒకే పార్టీ కంభంపాటి రాంమోహన్
చాలా మంది దగ్గర ఉంటే శత్రువులు అవుతారు కానీ… కంభంపాటి అలా కాదు.
కంభంపాటి రాంమోహన్ ఎన్నో పదవులు నిర్వహించారు.
ప్రతీ ఒక్కరికి ఒక వ్యాపారమో, ఇల్లు గడిచే విధంగా ఉంటే బాగుంటుందని నేను ఎప్పుడు చెబుతా.
రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుంది.
రేపు 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుపుకుంటాం.
ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు రాబోయే సంవత్సరంలో ఉంటుంది.
ప్రజల మేలు కోసం మేము పని చేస్తాం.
సీపీఐ నారాయణ సిద్ధాంతాల కోసం పని చేస్తారు.
రాజకీయాల్లో వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా… అప్పుడు ఎన్టీఆర్ రాజకీయలకే ఓటు వేశారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి రిసింది.
నాడు మేము చేసింది జాతికే ఆదర్శం అయ్యింది.
పార్లమెంటులో టీడీపీ ప్రధాన ప్రతిపక్షం గా కూడా ఉంది
ప్రజాహితం కోసమే పని చేశాం కానీ మళ్ళీ అధికారంలోకి రావాలని చేయలేదు అలా చేస్తే ఎప్పుడూ అధికారంలోనే ఉండే వాళ్ళం.
చేసిన అభివృద్ధి నాకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది.
నేను ఐటి గురించి అప్పుడే చెప్పా. వైఎస్ లాంటి వాళ్ళు విమర్శించారు.
నాడు పెట్టిన ఐటి కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసి ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్నారు.
పేద పిల్లల్ని ఐటి ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దింది టీడీపీ.
ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడంమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది
టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావాలు కలిగిన పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడే చెప్పారు.